ECE

EEE

Mech.

CSE

Civil

IT

EIE

Aeronautical

MME

Marine Engineering

Industrial Engg.


ఐఈఎస్‌కు సిద్ధమేనా?

  • ఇంజినీరింగ్‌ పట్టభద్రులు అత్యున్నత సర్వీసుగా భావించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప‌రీక్షలో విజ‌యం సాధించాలంటే ఇంజినీరింగ్ చ‌దువుతున్నప్పటి నుంచే ప్రణాళిక‌తో చ‌దివితే సుల‌భంగా సాధించ‌వ‌చ్చు . ఈ పరీక్షలో గరిష్ఠంగా మార్కులు సాధించాలంటే ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి? జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు వంటి గ్రూపు-ఎ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఇండియన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగు, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగు, నావల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికామ్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో దీనిద్వారా నియామకాలు జరుగుతాయి. మంచి జీతభత్యాలు, గౌరవం, పదోన్నతులతో ఆయా శాఖల్లో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగు పట్టా (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌) లేదా తత్సమాన అర్హత అవసరం. ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థులు కూడా పరీక్ష రాయొచ్చు. ఎంఎస్‌సీలో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌ లేదా రేడియో ఇంజినీరింగు సబ్జెక్టుల వారు కూడా కొన్ని పోస్టులకు అర్హులు.

    లక్ష్యం ఎలా ఉండాలి?
    సివిల్‌ ఇంజినీరింగు: ఈ విభాగంలో ఖాళీలు 300 నుంచి 400 వరకు ఉంటాయి. మిగతా విభాగాల్లో 100 వరకు ఉంటాయి. అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. కాబట్టి ఈ విభాగంలో కటాఫ్‌ తక్కువ. జనరల్‌ విభాగంలో మౌఖికపరీక్ష కటాఫ్‌ సుమారుగా 290. ఫైనల్‌ ఎంపికకు 450 మార్కులు. అంటే 290 మార్కులు వచ్చిన అభ్యర్థికి తుది ఎంపిక కావాలంటే ఇంటర్వ్యూలో 200 మార్కులకు 160 మార్కులు రావాలి. ఆచరణలో ఇది అసాధ్యం. మౌఖిక పరీక్షలో మార్కులు కనిష్ఠస్థాయిలో 40 నుంచి 50 వరకు, గరిష్ఠ స్థాయిలో 150 నుంచి 160 వరకు వస్తుంటాయి. అంటే అభ్యర్థి ఇంటర్వ్యూలో కనిష్ఠస్థాయి మార్కులు దృష్టిలో పెట్టుకుని రాత పరీక్షపై శ్రద్ధ పెట్టాలి. రాతపరీక్షలో కనీసం 400/1000 మార్కులకు కృషి చేయాలి.
    మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగు: ఈ విభాగంలో ఖాళీలు 100 నుంచి 150 వరకు ఉంటాయి. అభ్యర్థుల సంఖ్య కాస్త ఎక్కువే. ఇంటర్వ్యూ కోసం జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కులు సుమారు 360/1000. తుది ఎంపికకు 520/1200 ఉంటుంది. పైన ఇచ్చిన విశ్లేషణకు అనుగుణంగా రాతపరీక్షలో ఎక్కువ మార్కుల కోసం కృషి చేయాలి. రాత పరీక్షలో కనీసం 500 మార్కులకు కృషి చేయాలి.
    ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగు: ఈ విభాగంలో ఖాళీలు 75 నుంచి 150 వరకు ఉంటాయి. అభ్యర్థుల సంఖ్య బాగా ఎక్కువ. మౌఖిక పరీక్షకు జనరల్‌ విభాగంలో కటాఫ్‌ సుమారు 440/1000. తుది ఎంపికకు 580/1200 ఉంటుంది. రాత పరీక్షలో కనీసం 550 మార్కులకు ప్రయత్నించాలి. ఏదైనా ఒకటి లేదా అన్ని ప్రశ్నపత్రాల్లో కనీస నిర్ణయాత్మక మార్కులు నిర్దేశించే విచక్షణాధికారం సర్వీస్‌ కమిషన్‌కు ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని పేపర్లకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువమంది అభ్యర్థులు జనరల్‌ ఎబిలిటీ పేపరుపై శ్రద్ధ పెట్టరు. ఇది సరికాదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల్లో క్వాలిఫయింగ్‌ మార్కులు వస్తేనే కన్వెన్షనల్‌ జవాబు పత్రాలు దిద్దుతారు. ఈ కనీసమార్కులు అభ్యర్థుల కేటగిరీని అనుసరించి విడివిడిగా సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయిస్తుంది.

    రుణాత్మక మార్కులతో జాగ్రత్త
    ప్రతి తప్పు సమాధానానికీ కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు తగ్గిస్తారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలకు 200 మార్కులు. అంటే ప్రతి ప్రశ్నకూ 5/3 మార్కులు. తప్పు సమాధానానికి 5/9 నెగిటివ్‌ మార్కులు. అభ్యర్థులు కొన్ని ప్రశ్నలకు ఎలిమినేషన్‌ విధానంలో జవాబులు రాబట్టవచ్చు. అయితే ఎలాంటి క్లూ దొరకని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.

    ఆబ్జెక్టివ్‌ టెక్నికల్‌ పేపర్లలో ప్రశ్నల తీరు
    ఈ విభాగానికి కాలిక్యులేటర్లను అనుమతించరు.
    ¤ ఫార్ములాలు, వాస్తవ విషయాలకు సంబంధించినవి - 15 శాతం
    ¤ అసర్షన్‌, రీజనింగ్‌ - 5 - 10 శాతం
    ¤ మాచింగ్‌ ప్రశ్నలు - 10 శాతం
    ¤ ప్రాథమిక, మౌలిక అంశాలకు సంబంధించినవి - 40 శాతం
    ¤ అనువర్తనాలకు సంబంధించినవి - 25 శాతం.

    ఉపయోగపడే పుస్తకాలు
    ¤ 6 నుంచి 10వ తరగతి - ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఐఈఎస్‌ పరీక్షలో 70 శాతం వస్తాయి.
    ¤ స్పెక్ట్రమ్‌ సైన్స్‌ పుస్తకాలు లైఫ్‌సైన్సుకు సంబంధించి ఎంతగానో ఉపయోగపడతాయి.
    ¤ టాటా మెక్‌గ్రాహిల్స్‌ జనరల్‌ స్టడీస్‌ బాగా ఉపయోగపడుతుంది.
    ¤ వర్తమాన అంశాల కోసం కాంపిటిషన్‌ విజర్డ్‌ వంటి మాసపత్రిక, హిందూ పేపర్‌ చదవాలి.

    సన్నద్ధత ఎలా ఉండాలి?
    ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ఐఈఎస్‌ పరీక్షకు ఎంతైనా అవసరం. ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన అభ్యర్థికి ఉండాలి. రోజుకు 2 గంటలు జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌కు, 6-8 గంటలు ఇంజినీరింగు సబ్జెక్టులకు కేటాయిస్తే విజయం తథ్యం. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సలహాలు తీసుకొంటూ ప్రామాణిక గ్రంథాలు చదవాలి. సబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలకు సంబంధించి తయారీ విస్తృతంగా ఉండాలి. కన్వెన్షనల్‌కి సంబంధించి ఎంపిక చేసుకున్న అంశాలను కేంద్రీకృతంగా చదవాలి. యూపీఎస్‌సీ నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్షల పేపర్లను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు గేట్‌పాల్‌ పేపర్లు, ఇతర పబ్లిక్‌ సెక్టార్లలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.సబ్జెక్టివ్‌ టైప్‌లో చేతిరాత ప్రాముఖ్యం వహిస్తుంది. కాబట్టి అభ్యర్థి రోజూ రెండు ప్రశ్నలను అభ్యాసం చేస్తే పరీక్ష సమయంలో చేతిరాత సులభంగా ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి అడిగిన కన్‌వెన్షనల్‌ పేపర్లను అధ్యయనం చేయటం మేలు.

    పర్సనాలిటీ టెస్ట్‌ (మౌఖిక పరీక్ష)
    రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా 1: 2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు సాధారణంగా పిలుస్తారు. దీనిలో అభ్యర్థి ఆలోచన విధానాన్నీ, శక్తిసామర్థ్యాలు, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి ఐఈఎస్‌ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలకు, హాబీలకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు.మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత విషయాలు గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సామాజిక, వర్తమాన అంశాలు గురించి కూడా అడగవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం వెళితే ఈ మౌఖిక పరీక్షలో అధిక మార్కులు సాధించే అవకాశం ఉంది.

    Click here for Previous Papers
    .

  • ఇంజినీరింగ్‌లో... తొలి మెలకువలు
  • కృషి చేయాలి, కష్టపడాలి
  • పర్యవేక్షణ... క్రమశిక్షణ

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning