ఓఎన్ జీసీలో 745 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు

ఈనాడు, హైదరాబాద్: ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్ జీసీ) 745 గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. ఈ పోస్టుల కోసం గేట్‌-2015 కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. గేట్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి పోస్టుల‌కు ఎంపిక‌చేస్తారు. అభ్య‌ర్థులు గేట్ కోసం అక్టోబ‌ర్ 1లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. గేట్ ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 31, 2015 నుంచి ఫిబ్ర‌వ‌రి 14, 2015 వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఫ‌లితాలు మార్చి 12, 2015న విడుద‌ల‌వుతాయి. ఓఎన్‌జీసీ పోస్టుల కోసం అభ్య‌ర్థులు ఆ సంస్థ‌ వెబ్‌సైట్‌లో జ‌న‌వ‌రిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హుల‌కు మే, 2015 నుంచి ఓఎన్‌జీసీ ఇంట‌ర్వ్యూలు చేప‌డుతుంది. పూర్తి వివ‌రాల కోసం http://www.ongcindia.com/ చూడవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning