గేట్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే

* 31 నుంచి పరీక్షలు ప్రారంభం
* పరీక్షకు నాన్ ప్రోగ్రామబుల్ కాలుక్యులేటర్ అనుమతి

ఈనాడు, హైదరాబాద్: గేట్ పరీక్షలన్నీ మొదటిసారిగా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. గత ఏడాది వరకు కొన్ని సబ్జెక్టులకే పరిమితం కాగా ఈ దఫా మొత్తం 22 సబ్జెక్టులను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. పీజీ ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందడానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (గేట్)కు దాదాపు 9 లక్షల మంది హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వీటికి లక్షన్నర మందికిపైగా విద్యార్థులు హాజరు కావొచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే గేట్ స్కోర్‌ను చూసే ముఖాముఖికి పిలుస్తున్నారు. దాంతో ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు రాస్తున్నారు. ఈ పరీక్షలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 1, 7, 8 తేదీల్లో కూడా జరుగుతాయి. నోటిఫికేషన్ సమయంలో కాలిక్యులేటర్లను అనుమతించేది లేదని ప్రకటించినా, తర్వాత కమిటీ నిర్ణయం మేరకు నాన్ ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్లను అనుమతించనున్నామని పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్ అధికారులు ప్రకటించారు. ఆన్‌లైన్ వర్చువల్ కాలిక్యులేటర్‌ను అనుమతించేది లేదని నిర్ణయించారు.

Posted on 07-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning