ఐపీఈలో పీజీ కోర్సులు

హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ విద్యాసంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (IPE) అందిస్తున్న మేనేజ్‌మెంట్‌ కోర్సులకు దరఖాస్తు చేయటానికి ఈ నెలాఖరు వరకే (జనవరి 31) గడువు ఉంది. 51 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ తన బీ స్కూల్‌ ద్వారా పరిశోధన నుంచి కన్సల్టెన్సీ, శిక్షణ, మేనేజ్‌మెంట్‌ విద్యను అందించటం వరకూ పరిధిని విస్తృతం చేసుకుంది.
ఈ సంస్థ
1) పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌
2) పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌-రిటైల్‌ మార్కెటింగ్‌
3) పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌-ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
4) పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- ఇంటర్నేషనల్‌ బిజినెస్‌
5) పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తోంది. ఇంకా ఎగ్జిక్యూటివ్‌ పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌, డాక్టరల్‌ రిసెర్చి ప్రోగ్రాం ఆఫ్‌ ఐపీఈ, ఎంబీఏ (పీఈ) ప్రోగ్రాంలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఇవి రెండు సంవత్సరాల వ్యవధి ఉన్న పీజీ కోర్సులు. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్ష (CAT/XAT/ MAT/ATMA/CMAT) ర్యాంకు, బృంద చర్చ, వ్యక్తిగత మౌఖిక పరీక్ష, నిలకడ అయిన విద్యాపరమైన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేర్చుకుంటారు. వివరాలకు www.ipeindia.org సైట్‌ చూడవచ్చు.

Posted on 27-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning