హైదరాబాద్‌లో అంతర్జాతీయ యువజన ప్రాంగణం

* ఉపముఖ్యమంత్రితో ఐవైఎఫ్‌ ప్రతినిధుల భేటీ
ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువజన ప్రాంగణాన్ని ఏర్పాటుచేస్తామని అంతర్జాతీయ యువజన సంస్థ (ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫౌండేషన్‌) వ్యవస్థాపకుడు వోక్‌ సూ పార్క్‌ తెలిపారు. సంస్థ ప్రతినిధులతో కలిసి జూన్ 18న తెలంగాణ సచివాలయంలో ఆయన ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీతో భేటీఅయ్యారు. 92 దేశాల్లోని 3250 శాఖల ద్వారా తమసంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, కొరియా రాజధాని సియోల్‌లో ప్రపంచ యువజన ప్రాంగణాన్ని ఇప్పటికే నిర్మించామని పేర్కొన్నారు. రెండో ప్రాంగణానికి హైదరాబాద్‌ను ఎంపికచేశామని, త్వరలోనే నిర్మాణం చేపడతామని చెప్పారు. యువత అభివృద్ధి, నైపుణ్యశిక్షణకు తమసంస్థ కృషిచేస్తుందన్నారు. భారత్‌లో తమకు 20 శాఖలున్నాయని, హైదరాబాద్‌లోని పలు ఇంజినీరింగు కళాశాలలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. మహమూద్‌అలీ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ప్రాంగణ నిర్మాణానికి తమ ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని చెప్పారు. తర్వాత ప్రతినిధిబృందం యువజన సర్వీసులశాఖ మంత్రి పద్మారావును కలిసింది.


Posted on 19 - 06 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning