![]() |
ఈ ఉద్యోగాల్ని ‘ఫోని’వ్వకండి!
మనదేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారి సంఖ్య 33 కోట్లకుపైనే ఉంది. చైనా తర్వాత భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికాను కూడా ఏడాది కిందటే అధిగమించాం. అయితే మన జనాభాతో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్ పరిశ్రమ, వినియోగదారుల సంఖ్య ఇంకా చాలా విస్తరించాల్సి ఉంది. అందుకే ఈ రంగం భవిష్యత్తులో అభ్యర్థులకు ఉద్యోగాల కల్పతరువుగా మారనుంది.
ప్రస్తుతం మనదేశంలో 40కి పైనే స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో విడిభాగాల తయారీ కేంద్రాలు 15 ఉన్నాయి. మేకిన్ ఇండియా నినాదంతో వీటి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ సంస్థ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం మనదేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లలో దాదాపు 80 శాతం ఇక్కడే తయారవుతున్నాయి. సుమారు 50 వేల మంది ప్రత్యక్షంగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఏటా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్నందువల్ల ఉద్యోగావకాశాలూ పెరగనున్నాయి. 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 50 కోట్లకు చేరవచ్చని అంచనా. దీనివల్ల సుమారు 8 లక్షల ఉద్యోగాలు ఏర్పడవచ్చు. ఒక్క స్మార్ట్ ఫోన్ విభాగంలోనే ఇంత పెద్ద ఎత్తున కొలువులకు అవకాశాలు ఉండగా మొత్తం టెలికాంలోని వివిధ విభాగాల్లో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిని అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధం కావాలి.
టెలికాం తయారీ రంగంలో 14.2 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని టెలికాం రంగ నైపుణ్యాభివృద్ధి మండలి చెప్తోంది.
విభాగాలు, సామర్థ్యాలు....
స్మార్ట్ ఫోన్ రంగంలో అవకాశాలు కల్పించే విభాగాలు...
* డిజైన్, తయారీ (హార్డ్‌వేర్) * యాప్ డెవలప్మెంట్, డేటా (సాఫ్ట్వేర్) * ఆపరేషన్స్ (బిజినెస్)
* ఉపయోగపడే కోర్సులు: మెటీరియల్స్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్.
రాబోయే కొలువులు
* మొబైల్ ఫోన్ సిస్టమ్ ఇంజినీర్
* ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐఫోన్, విండోస్ మొబైల్ అప్లికేషన్స్ డెవలపర్
* మొబైల్ అప్లికేషన్స్ టెస్టింగ్ స్పెషలిస్ట్
* ఐపీఏడీ డెవలపర్
* గేమ్ డెవలపర్
* మొబైల్ ఆర్కిటెక్ట్ / మొబైల్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్ట్
* మొబైల్ టెక్నీషియన్స్
* మొబైల్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మెకానిక్
* టెలికమ్యూనికేషన్స్ టవర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్
* కేపీఐ (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్) ఇంజినీర్
* మొబైల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్
* మొబైల్ ఫోన్ వెరిఫికేషన్ మేనేజర్
* మొబైల్ ఆర్కిటెక్ట్
* టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్
స్మార్ట్ డిజైన్
స్మార్ట్ ఫోన్ డిజైనింగ్‌లో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ యూఐ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, స్ట్రాటజిక్ / సర్వీస్ / యూఎక్స్ డిజైన్. ఇవన్నీ విభిన్నమైనవి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ ఫోన్లను డిజైన్ చేయడం వీరి కర్తవ్యం.
స్మార్ట్ ఫోన్ డిజైనర్లకు మరీ ఉన్నత విద్యార్హతలు ఏమీ అవసరం లేదు. మంచి సృజనాత్మక సామర్థ్యాలు మాత్రం తప్పనిసరి. స్మార్ట్ ఫోన్లో ఏ భాగం అంటే ఆసక్తి ఉందో దానికి సంబంధించిన డిజైనింగ్‌పై అభిరుచి అవసరం. ఫలానా కోర్సు చదివినవారే కావాలనే నిబంధనలేవీ కంపెనీలు విధించడం లేదు. ఏ కోర్సు చదివినా, డిజైనింగ్‌పై మీకు ఇష్టం, తగిన సామర్థ్యాలు, సృజనాత్మకత ఉన్నాయని కంపెనీకి తెలిస్తే సరిపోతుంది. ఉపయోగించేవారికి అభిరుచులు, మరింత సౌకర్యవంతంగా ఫోన్‌ను ఉపయోగించడానికి ఎలాంటి డిజైన్ అవసరమనే అంశంపై దృష్టి పెట్టాలి.
యాప్ / గేమ్ డెవలప్మెంట్
ప్రతి చిన్న అవసరానికీ ఏదో ఒక యాప్ మీద ఆధారపడటం అలవాటైంది. బ్యాంకింగ్, దుస్తులు, యోగా, భోజనం, ఇంట్లో నిత్యావసరాలు... ఇలా అన్నీ యాప్ ద్వారానే జరిగిపోతున్నాయి. యాప్ డెవలపర్లకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నైపుణ్యం తప్పనిసరి.
ఈ భాషలు రావాలి!
* సీ: ఇది చాలా ప్రాథమికమైన లాంగ్వేజ్, మిగతా వాటికి పునాది లాంటిది. దీనిలో నైపుణ్యం ఉంటే డీబగ్గింగ్, మెమరీ మేనేజ్మెంట్, మంచి కోడింగ్ రాయడంలో ఉపయోగపడుతుంది.
* జావా: ప్రోగ్రామింగ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్న లాంగ్వేజ్ జావా. సీ ప్లస్ ప్లస్, పెర్ల్, పైతాన్, పీహెచ్పీలో అవసరమయ్యే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సూత్రాల రూపకల్పనలో ఉపయోగపడుతుంది.
* పైతాన్: తేలిగ్గా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ రాయడానికి పట్టే సమయం కూడా తక్కువ. కాన్సెప్ట్‌లు నేర్చుకుంటే, వేగంగా ప్రావీణ్యం సాధించవచ్చు.
* జావా స్క్రిప్ట్: ఇది మెరుగైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీటితోపాటు హెచ్‌టీఎంఎల్, ఓపెన్జీఎల్, యానిమేషన్, డాట్ నెట్ సామర్థ్యాలు కూడా యాప్ డెవలప్మెంట్ కెరియర్‌కు ఉపయోగపడతాయి.
* బ్యాక్ ఎండ్ / సర్వర్ సైడ్ ప్రోగ్రామర్: దీనికి పైతాన్, రూబీ, పీహెచ్డీ, జావా లేదా డాట్నెట్ సామర్థ్యాలు అవసరం. డేటాబేస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉండాలి.
* ఫ్రంట్ ఎండ్ / క్లయింట్ సైడ్ ప్రోగ్రామర్: హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్తోపాటు డిజైనింగ్ సామర్థ్యాలు అవసరం.
* మొబైల్ ప్రోగ్రామర్: మొబైల్ వెబ్సైట్లు అభివృద్ధి చేయాలంటే సీ లేదా జావా, హెచ్‌టీఎంఎల్ లేదా సీఎస్ఎస్తోపాటు సర్వర్‌కు సంబంధించిన అవగాహన ఉండాలి.
* త్రీడీ ప్రోగ్రామర్ / గేమ్ ప్రోగ్రామర్: సీ లేదా సీ ప్లస్ ప్లస్, ఓపెన్ జీఎల్, యానిమేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తోపాటు కళాత్మక దృష్టి ముఖ్యం.
* హై పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామర్: దీనికి కూడా సీ, సీ ప్లస్ ప్లస్, జావా సామర్థ్యాలు అవసరం. మేథమేటిక్స్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
ఈ సామర్థ్యాలు అవసరం...
స్మార్ట్ ఫోన్ తయారీ పరిశ్రమల్లో పనిచేయడానికి కింది సామర్థ్యాలు ఉండాలి...
* హెచ్‌టీఎంఎల్ 5 లో మంచి పరిజ్ఞానం, అనుభవం
* జావా స్క్రిప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెండ్ జావా స్క్రిప్ట్, జేక్వెయిరీలో పట్టు.
* కే2 బ్లాక్పెర్ల్, కనెక్ట్, ఏఎస్పీ డాట్నెట్, ఏడీఓ డాట్నెట్, సీ ప్లస్, ఎస్‌క్యూఎల్, సిల్వర్ లైట్ అంశాల్లో పరిజ్ఞానం.
* ఆండ్రాయిడ్ / ఐఫోన్ ఎస్డీకే, జే2ఎంఈ, బ్లూటూత్, వైర్లెస్ డేటా లింక్ లేయర్, వైఫై, వైమ్యాక్స్లపై అవగాహన.
* సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అంశాలను గుర్తించడం, విశ్లేషించడంలో నైపుణ్యం.
* మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్, వర్క్‌ఫ్లో, సొల్యూషన్స్, టెంప్లేట్స్ గురించి లోతైన పరిజ్ఞానం.
* యూఐ డిజైనింగ్, యూఐ ప్రోటోటైప్ సామర్థ్యాలు.
* నూతన ఆవిష్కరణలూ, సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి.
* మొబైల్ వెబ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్లు డిజైన్ చేయడంలో అనుభవం.
* ఫాల్ట్ ఎనాలిసిస్, రిమూవల్ టెక్నాలజీల్లో తెలివితేటలు.
* ఎలక్ట్రానిక్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం.
మరిన్ని ఉద్యోగాలు...
భారత్‌లో ఇప్పటివరకు వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. 2020 నాటికి మొత్తం 20 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను విడుదల చేయబోతున్నాం. అందువల్ల ఏఐ నిపుణులకు కూడా అవకాశాలు పెరగనున్నాయి.
Posted on 17-05-2018