• టీహెచ్ఎస్టీఐలో టెక్నీషియన్స్
 • గుర్గావ్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ) టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి జులై 16 నుంచి 19 వరకు వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
  వివరాలు................
  1) టెక్నికల్ అసిస్టెంట్: 1
  విభాగాలు: ఫీల్డ్.
  అర్హతలు: క్లినికల్ రిసెర్చ్‌లో డిగ్రీ/ డిప్లొమాతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం లేదా ఇంటర్‌తో పాటు సంబంధిత విభాగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
  2) టెక్నీషియన్: 6
  విభాగాలు: క్లినికల్/ ఫీల్డ్
  అర్హతలు: క్లినికల్ రిసెర్చ్/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/ నర్సింగ్‌లో డిప్లొమా/ డిగ్రీ లేదా పదో తరగతి/ ఇంటర్‌తో పాటు సంబంధిత విభాగంలో ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.
  3) ఫీల్డ్ అసిస్టెంట్: 1
  అర్హతలు: పదో తరగతి, క్లినికల్ ఫీల్డ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
  4) ల్యాబ్ అటెండెంట్: 2
  అర్హతలు: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
  5) టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 1
  అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/ ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
  వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
  ఇంటర్వ్యూ వేదిక: Administrative Office,
  Translational Health Science & Technology Institute,
  Plot No. 470,
  Udyog Vihar,
  Phase- III,
  Gurgaon- 122016.

 • Notification