ఎక్కువగా వెళుతున్న దేశాలు!


మన రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉక్రెయిన్, కిర్గిస్థాన్ దేశాలకు వెళుతున్నారు. యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన 'బొలొగ్నా విధానానికి అనుగుణంగా బోధన ఉండటం, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ (ఈసీటీఎస్) ప్రకారం ఈ దేశాల్లోని యూనివర్సిటీలు అందించే డిగ్రీలు 47 దేశాల్లో చెల్లుబాటు కావడం దీనికి కారణం. మిగిలిన దేశాలతో పోలిస్తే, ఈ దేశాల్లో అయ్యే ఖర్చు తక్కువ. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన మెరుగ్గా ఉంటుంది. భద్రతాపరంగానూ ఇవి సురక్షితం. శాస్త్ర-సాంకేతిక రంగాలతోపాటు వ్యవసాయ రంగంలోనూ విశేషమైన అభివృద్ధి సాధించాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చి అనేక విద్యాసంస్థలనూ, ఆసుపత్రులను నెలకొల్పాయి.
ఈ కారణంగానే పై రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల నుంచి 50 వేలకుపైగా విదేశీ విద్యార్థులున్నారు. భారతీయ విద్యార్థులు ఎక్కువగా చదువుతుండటం వల్ల ఇటీవల ఇక్కడి విద్యా సంస్థల్లో ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలనూ, ఇండియన్ క్యాంటీన్లనూ ప్రారంభించారు.

మన తెలుగు తేజాలైన డాక్టర్ ఫణి భూషణ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు వైస్ డీన్ (ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విభాగం)గా; డాక్టర్ బి. దివ్యా సునితా రాజ్ ఉక్రెయిన్ స్టేట్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌కు భారత ప్రతినిధిగా వ్యవహరిస్తుండటం మరో విశేషం.

చైనాకూ ఎక్కువే!
చైనా సరిహద్దు దేశం కావడం, భారత వాతావరణ పరిస్థితులకు చాలా వరకు దగ్గరి పోలికలను కలిగి ఉండటం లాంటి కారణాల వల్ల వైద్య విద్య కోసం మన దేశం నుంచి ఆ దేశానికి కూడా ఎక్కువగా వెళుతుంటారు. చైనాలో ఇంటర్న్‌షిప్ చేయడం ఆప్షనల్. అంటే చైనాలోనైనా చేయవచ్చు లేదా ఇండియాలోనైనా చేయవచ్చు. ఎంసీఐ ఈ అవకాశాన్ని ఒక్క చైనా వైద్యవిద్యకు మాత్రమే కల్పించింది. విదేశాల నుంచి విద్యార్థులు ఎక్కువగా వస్తుండటంతో, దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇటీవల చైనా యూనివర్సిటీలు ఫీజులను పెంచాయి. దీంతోపాటు చైనాలోని విశ్వవిద్యాలయాల్లో కోర్సు వ్యవధికి సంబంధించి స్పష్టమైన విధానం లేదు. డబ్ల్యూహెచ్‌వోలో నమోదైన చైనా విద్యాసంస్థలన్నింటినీ భారత వైద్య మండలి గుర్తించడం లేదు. ఎంసీఐ ఇప్పటివరకూ అనుమతినిస్తున్న చైనా కాలేజీల సంఖ్య 50 (వీటి వివరాలను www.mciindia.org/mediaroom/listofchinacolleges.aspx లో చూడవచ్చు). అందువల్ల ఇటీవల వైద్య విద్య కోసం చైనాకు వెళ్లడం కొంత మేరకు తగ్గింది.
మనరాష్ట్రం నుంచి విద్యార్థులు ఎక్కువగా వెళుతున్న దేశాలు

ఉక్రెయిన్ విద్యాసంస్థలు:
1) Zaporozhye State Medical University (జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ)
వెబ్‌సైట్: www.zsmu.edu.ua
2) Vinnitsa National Medical University (విన్నిత్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ)
3) LVIV National Medical university (ఎల్‌వీఐవీ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ)
4) Donetsk National Medical University (డొనెట్స్క్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ)
వెబ్‌సైట్: www.dsnmu.com

5) Kiev National Medical University (కైవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ)
6) Kharkov National Medical University (ఖార్కోవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ)
7) Crimean State Medical University (క్రైమీన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ)
8) Lugansk State Medical University (లుగాన్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ)
వెబ్‌సైట్: www.lsmu.com
9) Odessa State Medical University (ఒడెస్సా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ)
కోర్సు వ్యవధి: 5 సంవత్సరాల 7 నెలలు.
ఫీజు: సెమిస్టరుకు 1950 - 2100 అమెరికన్ డాలర్లు. (రూ.1.10 లక్షల నుంచి రూ.1.25 లక్షలు).
కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది.
ఉక్రెయిన్ మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్: www.umenetwork.com
ఉక్రెయిన్ ఎంబసీ: www.mfa.gov.ua/india/en

కిర్గిస్థాన్ విద్యాసంస్థలు:
1) International School of Medicine, International University of Kyrgyzstan (ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)
వెబ్‌సైట్: www.iuk.kg
2) Kyrgyz State Medical Academy
వెబ్‌సైట్: http://ksma.kyrnet.kg
కోర్సు వ్యవధి: 5 నుంచి 6 ఏళ్లు (యూనివర్సిటీని బట్టి). ఫీజు: సెమిస్టరుకు 1250 అమెరికన్ డాలర్లు (రూ.72500) కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఖర్చవుతుంది.
కిర్గిస్థాన్ మెడికల్ వెబ్‌సైట్: www.med.kg
ఐఎస్ఎం వెబ్‌సైట్: www.ismiuk.com

చైనా విద్యాసంస్థలు:
భారత వైద్య మండలి గుర్తించిన చైనా వైద్య విద్యా సంస్థలు:
www.mciindia.org/mediaroom/listofchinacolleges.aspx
కోర్సు వ్యవధి: 5 ఏళ్లు.
ఫీజు: సెమిస్టరుకు 1850 నుంచి 3000 అమెరికన్ డాలర్లు (లక్ష రూపాయల నుంచి రూ.1.75 లక్షలు)
కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది.

రష్యా విద్యాసంస్థలు:
1) Rostov Medical University
2) Saratov Medical University
3) Stavropol State Medical Academy (SSMA)
వెబ్‌సైట్: www.stgma.ru

4) Moscow Medical University (MM1)
5) People Friendship University (MM2)
6) Volgograd State Medical University
7) St.Peter's Berg University
కోర్సు వ్యవధి: 6 ఏళ్లు.
ఫీజు: సెమిస్టరుకు 1950 - 2100 అమెరికన్ డాలర్లు. (రూ.1.10 లక్షల నుంచి రూ.1.25 లక్షలు). కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది.
వెబ్‌సైట్:
www.edurussian.com/medical

బెలారస్ విద్యాసంస్థలు:
1) Gomel State Medical Institute
వెబ్‌సైట్: www.gsu.unibel.by/vframes.asp
2) Grodno State Medical Institute
వెబ్‌సైట్: www.grsmu.by
3) Minsk State Medical Institute
వెబ్‌సైట్: www.msmi.mink.by

4) Vitebsk State Medical Institute
వెబ్‌సైట్: www.vgmu.vitebsk.net
కోర్సు వ్యవధి: 6 ఏళ్లు.
ఫీజు: సెమిస్టరుకు రూ. 85 వేలు. కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చవుతుంది.

జార్జియా
కోర్సు వ్యవధి: 6 ఏళ్లు.
ఫీజు: సెమిస్టరుకు రూ. 85 వేలు. కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చవుతుంది.
వెబ్‌సైట్: www.georgiahealth.edu/medicine

ఫిలిప్పీన్స్, మధ్య అమెరికా
కోర్సు వ్యవధి:
5 1/2 ఏళ్లు.
ఫీజు: సెమిస్టరుకు 2500 అమెరికన్ డాలర్లు (రూ.1.45లక్షలు). కోర్సు పూర్తిచేయడానికి మొత్తం రూ.18 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు ఖర్చవుతుంది.
 

<--back