ఎవరు అర్హులు?
వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లేవారికి ఇంటర్ తర్వాత ఎంసెట్‌కు వర్తించే నిబంధనలే వర్తిస్తాయి.
* ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
* బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
* లాంగ్వేజి సబ్జెక్టులను మినహాయించి 50 శాతం (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం) ఉత్తీర్ణత తప్పనిసరి.
* కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనవారూ అర్హులే.
* విదేశీ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన ఏడాది డిసెంబరు 31 నాటికి అభ్యర్థి వయసు 17 ఏళ్లు నిండి ఉండాలి. తగిన అర్హతలతో గుర్తింపు ఉన్న కళాశాలలో ప్రవేశం పొందాలి. స్టడీ సర్టిఫికేట్లు, పాస్‌పోర్టు, స్టూడెంట్ వీసా పొందిన తర్వాత సంబంధిత దేశ ఎంబసీని సంప్రదించి, ప్రవేశ అనుమతిని ధ్రువీకరించుకోవాలి.
ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కోసం ఎంసీఐకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు Board of Intermediate, AndhraPradesh పేరుతో రూ.100 డీడీని పంపించాలి. అన్ని వివరాలు సరిగా ఉంటే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌ను పోస్ట్ ద్వారా విద్యార్థి చిరునామాకు పంపిస్తారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇదే సర్టిఫికేట్ ఆధారంగా భారత వైద్య మండలి నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు హాజరవాల్సి ఉంటుంది.

<--back