నిపుణుల సలహాలు
చదవండి.. నివసించండి.. సంపాదించుకోండి!
ఉక్రెయిన్ అనేది తూర్పు యూరప్ దేశం. 47 యూరప్ దేశాలు కలిసి 'బొలొగ్నా' విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. దీని ప్రకారం ఉక్రెయిన్‌లో మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎం.డీ., ఫిజీషియన్) కోర్సులు చేసిన వారు ఈ 47 దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది. 'చదవండి, నివసించండి, సంపాదించుకోండి' (Study, Stay, Earn) విధానంలో కోర్సు పూర్తి చేసినవారు వీటిలో ఏ దేశంలోనైనా పని చేయవచ్చు. అంటే ఉక్రెయిన్‌కు వీసా లభిస్తే ఈ 47 దేశాల్లో ఎక్కడైనా అడుగు పెట్టవచ్చు. కాబట్టి వీసా నిబంధనలు కొంత కఠినంగానే ఉంటాయి. 'ఉక్రెయిన్ స్టేట్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

దీని వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను ఇక్కడే నిర్వహించే సౌలభ్యం కలిగింది. మన విద్యార్థులు ఎక్కువగా ఉన్న జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వారి అనుమతితో ఆంధ్రామెస్‌ను ఏర్పాటు చేయడం మరో విశేషం. కోర్సుతోపాటు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ శిక్షణను కూడా అందిస్తున్నారు. భారత్ నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎడ్యుకేషన్ లోన్లను ఇప్పించడంలోనూ తోడ్పాటునందిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా ఉక్రెయిన్‌తో భారత్‌కు సత్సంబంధాలున్నాయి. ఈ దేశ శాస్త్రజ్ఞులు ఇస్రోతో కలిసి వివిధ అంతరిక్ష కార్యక్రమాల్లో పని చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యవసాయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ దేశం గణనీయమైన ప్రగతి సాధించింది. టిష్యూకల్చర్, వైద్యరంగంలో అతి క్లిష్టమైన 'కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానాలను అభివృద్ధి చేయడంలో ఉక్రెయిన్ శాస్త్రవేత్తల కృషి అమోఘం. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఎక్కువగా ఈ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉక్రెయిన్‌లోని వివిధ యూనివర్సిటీల్లో మన దేశం నుంచి సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచే 3 వేల మందిదాకా ఉన్నారు.
- డాక్టర్ బి. దివ్యా సునితారాజ్,
భారత ప్రతినిధి, ఉక్రెయిన్ స్టేట్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్.
వెబ్‌సైట్: www.uscie.org
ఇ-మెయిల్: dr.divyaraj@yahoo.com
ఫోన్ నెంబర్లు: 9441115555, 7702021111 .

ఏటా సంఖ్య పెరుగుతోంది!
విదేశాల్లో మెడికల్ విద్యనభ్యసించడమనేది ఎన్నో ఏళ్ల నుంచే ఉన్నా, ఇటీవల దీని కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. విస్తృత ప్రచారం లభించడం, గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఏ దేశానికైనా వెళ్లడానికి పెద్దగా ఆలోచించకపోవడమే దీనికి కారణం. మేము 2003 నుంచి కిర్గిస్థాన్ దేశానికి విద్యార్థులను పంపిస్తున్నాం. ఇది మధ్య ఆసియాకు చెందిన చిన్న దేశం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల విభాగానికి వైస్‌డీన్‌గా మన తెలుగువారైన డాక్టర్ ఫణి భూషణ్ పనిచేస్తుండటం వల్ల మేం ఈ దేశాన్ని ఎంచుకున్నాం. అంతే కాకుండా మెడిసిన్ విద్య అందిస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే కిర్గిస్థాన్‌లో కోర్సు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. వైద్య విద్య కోసం విదేశాలకు మన రాష్ట్రం నుంచే ఎక్కువగా వెళుతుంటారు
.
అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని గమనించి ఈ యూనివర్సిటీలో ఆంధ్రామెస్‌ను, సంరక్షకురాలిని కూడా ఏర్పాటు చేశాం. కిర్గిస్థాన్‌లో మహిళా జనాభా ఎక్కువ. అందువల్ల ఇక్కడ మహిళలకు భద్రత ఎక్కువ. ఈ దేశంలో 247 రోజులూ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు జనవరిలో 4 0C నుంచి 140C వరకు, జులైలో 12 0C నుంచి 40 0C వరకు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ కిర్గిస్థాన్ 2003లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ను ఏర్పాటు చేసింది. దీంట్లో చదివిన అనేక మంది ఆసియాలోని వివిధ దేశాల్లో వైద్య సేవలందిస్తున్నారు. విదేశీ వైద్య విద్యకు పెరుగుతున్న ఆసక్తిని గమనించి కొన్ని ఏజెన్సీలకు చెందిన వ్యక్తులు, సీనియర్ విద్యార్థులు మోసాలకు పాల్పడుతున్నారు. దీన్ని గమనించి అంతర్జాతీయ విద్యార్థుల సౌకర్యార్థం తాము అనుమతించిన ఏజెన్సీల వివరాలను ఆయా దేశాలలోని వైద్య విద్యా సంస్థల వెబ్‌సైట్లలో పొందుపరిచారు. ఈ వివరాలను పరిశీలించి, మంచి కన్సల్టెన్సీలను సంప్రదించడం ద్వారా ఉత్తమ విద్యా సంస్థలో ప్రవేశం పొందవచ్చు.
- ఎం. రామారావు,
ఎడ్యుకేషనల్ అనలిస్ట్,
డైరెక్టర్, ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్,
అమీర్‌పేట్, హైదరాబాద్.
ఇ-మెయిల్: ismfocalpointindia@gmail.com
కాంటాక్ట్ నెంబరు: 9394641010

<--back