EAMCET I JEE ADVANCED I JEE MAIN I After Inter
 
Welcome to BITSAT 2014 - Special

బిట్‌శాట్ మే 14 నుంచి జూన్ 1 వరకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది.
బిట్‌శాట్‌లో మ్యాథమేటిక్స్ 45 ప్రశ్నలు, ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ 15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 10 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ప్రతి సరి అయిన సమాధానానికి '+3' మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ '-1' మార్కు. అంటే రుణాత్మక మార్కులు ఉంటాయి.
బిట్‌శాట్‌లో ర్యాంకు నిర్ధారణ ముఖ్యంగా ఇంగ్లిష్, రీజనింగ్‌ల మీద ఆధారపడి ఉంటుంది. మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మన ఎంసెట్ సిలబస్‌లోనే ఉన్నాయి కాబట్టి వాటికి అదనంగా తయారు కావలసిన అవసరం లేదు. ఈ నెలరోజులూ రోజుకు ఒక గంట ఇంగ్లిష్, రీజనింగ్‌లకు కేటాయించాలి. ప్రతి మార్కూ ఏ అంశం నుంచి ఇస్తారో సిలబస్‌లో విపులంగా ఉంది. దాని ఆధారంగా ఒక రోజు ఒక ప్రశ్న అనే విధంగా తయారైతే సరిపోతుంది.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నల స్థాయి మన ఎంసెట్ స్థాయిలోనే ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్‌పై రాసి, ఆన్‌లైన్ విధానం అలవాటు చేసుకుంటే మేలు జరుగుతుంది.
ఇందుకు ఉపయోగపడేవిధంగా నిపుణులు రూపొందించిన ఆన్ లైన్ పరీక్షలు, బిట్లు, సబ్జెక్టులవారీగా అందిస్తున్నాం. తమ అధ్యయనానికి మరింత పదును పెట్టుకోవడానికి అభ్యర్థులు వీటిని వినియోగించుకోవచ్చు.