* మా అబ్బాయి బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) పూర్తిచేశాడు. పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాడు. దానిలో ఏ బ్రాంచి మేలు? పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఎలా ఉంటుంది? దేశవిదేశాల్లో ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) తర్వాత పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయడం వల్ల కెమికల్‌, పెట్రోలియం రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. పెట్రోలియం ఇంజినీరింగ్‌లో చాలా బ్రాంచీలు ఉన్నప్పటికీ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ బ్రాంచి బాగా ప్రాచుర్యం పొందింది.
పెట్రోలియం అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిన తరుణంలో ఉద్యోగావకాశాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. భారతదేశంలో అతి కొద్ది విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు మాత్రమే ఈ కోర్సును అందించడం వల్ల ఈ రంగంలో నిపుణుల కొరత ఎక్కువ. ఈ కోర్సు చదివిన తరువాత పెట్రోలియం సంస్థలతోపాటు గ్యాస్‌, ఆయిల్‌ సంస్థలు, ఎనర్జీ రంగాలు, సహజవాయు సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. విదేశీ ఉద్యోగావకాశాల విషయానికొస్తే గల్ఫ్‌, సౌదీ దేశాల్లో ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా, కన్సల్టెంట్లుగా, విశ్వవిద్యాలయ అధ్యాపకులుగా కూడా పనిచేసే అవకాశాలున్నాయి.

కెమికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఫెర్టిలైజర్స్‌ & పెస్టిసైడ్స్‌ సంబంధిత అంశాల్లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. మన దేశంలో అందించే సంస్థల వివరాలు తెలపండి. ప్రభుత్వరంగ సంస్థల్లో చేరడానికి కావాల్సిన అర్హతలేంటి?

ఎంటెక్‌ కోర్సు అందించే విశ్వవిద్యాలయాలకు ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ (www.iari.res.in/); చౌదరి చరణ్‌సింగ్‌ హరియాణా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హిసర్‌ (http://bit.ly/1zwmecr); తమిళ్‌నాడు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, కోయంబత్తూర్‌(www.tnau.ac.in/);నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కర్నల్‌ (http://bit.ly/1OXmDgX); యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, బెంగళూరు (http://bit.ly/1OXlwOv) ని చూడండి. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లి.లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు బాచిలర్స్‌ డిగ్రీ 60% (ఎస్‌సీ/ ఎస్‌టీ- 50%) ఉత్తీర్ణత, 27 సంవత్సరాల వయసు ఉండి గేట్‌లో ఉత్తీర్ణత (80%) సాధించినవారికి మౌఖిక పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు (http://bit.ly/1DW3QyV), (http://bit.ly/1DncW3d) ని చూడండి.

కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాను. డీఆర్‌డీవోలో ఇంటర్న్‌షిప్‌ చేయాలనుంది. సాధ్యమవుతుందా?

డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ వారు నోటిఫికేషన్‌ ద్వారా ప్రాజెక్ట్‌/ ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎప్పటికప్పుడు వారి వెబ్‌సైట్‌ http://bit.ly/1G1QiDU ని పరిశీలించండి. ఇంటర్న్‌షిప్‌ సంపాదించడానికి ఎలా సన్నద్ధమవాలో http://bit.ly/1ADtFCe లో పొందుపరిచిన పద్ధతిని చూసి తెలుసుకోండి.

కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ప్రస్తుతం ఓ అల్యూమినియం కంపెనీలో చేస్తున్నాను. ఆయిల్‌, గ్యాస్‌ రంగాల్లోకి మారాలనుకుంటున్నాను. డీసీఎస్‌లో భవిష్యత్తు గురించి వివరించండి.

విద్యుత్తు, చమురు, గ్యాస్‌ రంగాలు డిస్ట్రిబ్యూషన్‌ కంట్రోల్‌ సిస్టం (డీసీఎస్‌) లాంటి ఆప్టిమైజేషన్‌ పరిష్కారాలను ఉపయోగించడానికి సుముఖత చూపిస్తున్నాయి. తాజా అంచనా ప్రకారం భారతీయ మార్కెట్‌ 2016 నాటికి సంపాదనలో గణనీయ ప్రగతి చూపిస్తుంది. ఈ పరిశీలనకు విద్యుత్తు, చమురు- గ్యాస్‌, పెట్రోకెమికల్స్‌, కెమికల్స్‌- ఫెర్టిలైజర్స్‌, మెటల్స్‌- మైనింగ్‌, పల్ప్‌- పేపర్‌, ఫార్మాస్యూటికల్స్‌, సిమెంట్‌, ఫుడ్‌- బేవరేజ్‌, వాటర్‌- వేస్ట్‌వాటర్‌, టెక్స్‌టైల్స్‌ లాంటి పరిశ్రమలను పరిగణనలోకి తీసుకున్నారు.
కాబట్టి డీసీఎస్‌ లాంటి అధునాతన సాంకేతికతను ప్రాసెస్‌ పరిశ్రమల్లో నిరంతర ప్లాంట్‌ పనితీరు పరిశీలనకు, ఎనర్జీని కాపాడుకోవడానికీ, ముందస్తు నిర్వహణలకు వాడుతున్నారు. కెమికల్‌ ఇంజినీర్లను ఆయిల్‌& గ్యాస్‌ పరిశ్రమలో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. వారు ముడిపదార్థాలు ఎలా ప్రాడక్ట్‌గా మారుతాయో, ప్రతి ఉత్పత్తి ప్రకియలో ఎలా సామర్థ్యం మెరుగుపరచాలో పరిశీలిస్తారు. ముఖ్యంగా కెమికల్‌ ఇంజినీరింగ్‌ అనేది ఆయిల్‌, గ్యాస్‌ ఆపరేషన్లకు వర్తిస్తుంది.
అందుకని కెమికల్‌ ఇంజినీర్లకు చాలా అవకాశాలు ఆయిల్‌ & గ్యాస్‌ రంగంలో ఉంటాయి. ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, ఆయిల్‌, జీఎస్‌పీసీ, షెల్‌ ఆయిల్‌, నికో రిసోర్సెస్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఈఎస్‌ఎస్‌ఏఆర్‌, చెవ్రాన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌, కెయిర్న్స్‌ ఎనర్జీ ఇండియా, భారత్‌ పెట్రోలియం, బీజీ ఎనర్జీ, కాస్ట్రాల్‌ ఇండియా, గెయిల్‌, ఐబీపీ, జిందాల్‌ లాంటి వాటిలో ఉద్యోగావకాశాలుంటాయి. http://bit.ly/1gbLwGf, http://bit.ly/PU0fMt లను చూడండి.

నేను కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని. ఏపీపీఎస్సీ రూరల్‌ ఇంజినీరింగ్‌ నియామకానికి ఎల్‌సీఈ చదివినవారు అర్హులని ఇచ్చారు. ఎల్‌సీఈ అంటే ఏంటి? ఈ పోస్టుకు దరఖాస్తు చేయడానికి నాకు అర్హత ఉందా?

http://website.apspsc.gov.in/Documents/NOTIFICATIONS/189.pdfలో Assistant Engineers in A.P. Rural Water Supply Engineerinng Subordinate Service . LCE issued by the state Board of Technical Education and Training A.P; of any other qualification equivalent thereto which are recognised by the SBTETచదివినవారే అర్హులని చెప్పారు. LCEఅంటే Licensed Civil Engineerఅని అర్థం. SBTETడిప్లొమా, PGడిప్లొమా లాంటి కోర్సులు నిర్వహిస్తారు. ఈ పోస్ట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన కనుక మీరు అర్హులు కారు.

బీటెక్‌ రెండో సంవత్సరం కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాను. నాకు కెమికల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తెలుపగలరు.

కెమికల్‌ ఇంజినీర్లకు ప్రభుత్వ రంగంలో చాలా సంస్థలు అవకాశాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐవోసీఎల్‌) , హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌), గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌), హిందుస్తాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ( హెచ్‌వోసీఎల్‌) మొదలైనవి. Food Processing, Mineral processing, Explosive manufacturing, coal preparation, Manufacturing, Pharmaceuticals, Petroleum manufacturing లాంటి మరెన్నో రంగాల్లో మీ కెరియర్‌ను మొదలు పెట్టండి

బీఎస్‌సీ (మాథ్స్) 2007లో పూర్తిచేశాను. 2008 నుంచి బాక్ ఎండ్ ఆపరేషన్స్‌లో సీనియర్ ఎనలిస్ట్‌గా చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ రంగంపై ఆసక్తితో 2012లో ఎంసీఏలో చేరాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగిస్తున్నాను. ఉద్యోగావకాశాలపై సమాచారం ఇవ్వగలరు.

మీరు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి కంపెనీల్లో బిజినెస్ ఆపరేషన్స్ ఎలా అవుతాయో, వాళ్లను ఉద్యోగం కోసం ఎలా సంప్రదించాలో ఇదివరకే అవగాహన వచ్చి ఉంటుంది. మీకు చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద ఐటీ సర్వీస్/ ప్రొడక్ట్ ఎమ్ఎన్‌సీ కంపెనీల్లో అవకాశాలు ఉండనే ఉంటాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, సర్వీసెస్ అండ్ అప్లికేషన్ సపోర్ట్‌ల్లో మీకు ఏది ఇష్టమో ఎంచుకోండి. ఎంసీఏలో మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్ మీకు ఇష్టమైతే దానిపైనే దృష్టి పెట్టండి. ఐటీ రంగంలో ఒడిదుడుకులున్నా కూడా మీరు ఇష్టమైన అంశంపై సత్తా చూపితే మీ కెరియర్ బాగుంటుంది.
కంప్యూటర్ సైన్స్ రంగంలో గెయిల్ కార్మికేల్ అనే మహిళ స్త్రీలను కంప్యూటర్ రంగంలో ప్రోత్సహిస్తూ తన బ్లాగ్ http://compscigail.blogspot.in/ రాస్తుంటుంది. ఇలాంటివాటిని అనుసరిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి. మీరు కూడా లింకెడిన్, బ్లాగుల ద్వారా మీ నైపుణ్యాలను వ్యక్తపరిచి రిక్రూటర్ల నుంచి మార్కులు కొట్టేయవచ్చు.

నాకు సిరామిక్ ఇంజినీరింగులో సీటు వచ్చింది. ఈ విభాగంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను తెలపండి.

టాటా రిఫ్రాక్టరి లిమిటెడ్ http://www. tataref.com లో మీరు రెండో సెమిస్టర్‌లోనే ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేయండి. సిరామిక్ ఇంజినీరింగ్ ఏరోస్పేస్, కన్స్యూమర్ యూసేజ్, ఆటోమోటివ్, మెడికల్ (బయోసెరామిక్స్), మిలిటరీ, కంప్యూటర్స్, కమ్యూనికేషన్ ఇలా ఎక్కడెక్కడ వాడతారో ఈ www.ceramicsubstrates.co.uk/ceramics.html ద్వారా తెలుసుకోండి.ప్రభుత్వ రంగంలో అయితే SAIL లాంటివి, ప్రైవేటు కంపెనీల కోసం గూగుల్ అలర్ట్స్ ద్వారా ఉద్యోగాల సమాచారం పొందుతుండండి.

నేను బీటెక్ 2007లో పూర్తిచేశాను. ప్రస్తుతం టెస్ట్ ఎనలిస్ట్‌గా చేస్తున్నాను. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పార్ట్‌టైమ్/ దూరవిద్య ద్వారా చేసి తరువాత పీహెచ్‌డీ కూడా చేద్దామనుకుంటున్నాను. యూనివర్శిటీల వివరాలు తెలుపగలరు.

మాస్టర్ కోర్సులు ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో చేసి తర్వాత గేట్‌లో మంచి స్కోర్ సాధించి పీహెచ్‌డీలో ప్రయత్నించడం మంచిది. కేవలం డిగ్రీ సర్టిఫికెట్‌ల కోసం ప్రైవేటు ఇంజినీరింగ్ సంస్థల్లో సదుపాయాలు, లైబ్రరీ, ఎలాంటివో తెలుసుకోకుండా చేరడం సరైనది కాదు. గత శీర్షికలో చెప్పినట్లుగా వీకెండ్ ప్రోగ్రాం నిర్వహించే కళాశాలలో ఉద్యోగం చేస్తూ కూడా చేరొచ్చు. మీకు వీలైతే నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో జీఆర్ఈ, గేట్ ద్వారా మరిన్ని వివరాలకు http://www.gse.nus.edu.sg/ RfromAug13Jan14.pdf వెబ్‌సైట్‌ను చూడండి.

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. కోర్ కంపెనీలోకి మారాలనుకుంటున్నాను. ఈ రెండేళ్ల అనుభవం ఉపయోగపడుతుందా? నాకున్న అవకాశాలను తెలియజేయండి.

మీరు ఈ రెండేళ్లు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా చేసివుంటే దాన్ని మీరు కోర్ కంపెనీలకు తెలిపి, ఇప్పుడు మళ్లీ కోర్‌వైపు ఎందుకు మారాలనుకుంటున్నారో మీ దరఖాస్తులో తెలియజేయాలి. ఇంజినీరింగ్‌లో ప్రాజెక్ట్ మీ కోర్ అంశాలపై చేసి ఉంటారు కదా. దానిలో మీ పరిజ్ఞానాన్ని వారికి తెలియజేయండి. మొదటగా మీకు కోర్ ఇంజినీరింగ్‌లో ఎలాంటి రంగంలో ఇష్టం ఉందో తెలుసుకోండి. ఉదాహరణకి పవర్ సిస్టమ్స్, పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్ డిజైన్, కంట్రోల్ సిస్టం. http://engineering.electricalequipment.org/ వంటి టెక్నికల్ ఫోరమ్స్ మీ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి.