బీటెక్‌ (ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సుకి ఉన్న ఉద్యోగావకాశాలేంటి? ఇందులో ఎంఎస్‌ చేయాలంటే ఏ దేశాన్ని ఎంచుకోవడం మంచిది? రాయాల్సిన పరీక్షలు ఏవి? - సాయి గాయత్రి

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు ఎయిర్‌ ఫోర్స్‌, ఎయిర్‌ లైన్స్‌, హెలికాప్టర్‌ కంపెనీలు, డిఫెన్స్‌ మినిస్ట్రీకి సంబంధించిన వివిధ శాఖల్లో ఏరోస్పేస్‌ ఇంజినీర్‌, డిజైన్‌ ఇంజినీర్‌, ప్రొక్షడన్‌ మేనేజర్‌, మెకానికల్‌ డిజైన్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ధర్మల్‌ డిజైన్‌ ఇంజినీర్‌ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, నేషనల్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌, ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, టీసీఎస్‌, సైయింట్‌ (CYIENT), ఎల్‌ అండ్‌ టీ లాంటి సంస్థల్లో ఉద్యోగాలు వస్తాయి. పీజీ స్థాయిలో ఏరో స్పేస్‌ కోర్సును అమెరికాలో చాలా యూనివర్సిటీలు అందిస్తున్నాయి. జీఆర్‌ఈతో పాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ రాసి మంచి స్కోరు సాధిస్తే ప్రవేశం పొందవచ్ఛు.

ఎంటెక్‌ (పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌) 2014లో పూర్తిచేశాను. నాకున్న ఉద్యోగావకాశాలేంటి? - రాణి

మన దేశంలో విద్యుత్‌ తయారీ, సరఫరా, పరికరాల తయారీకి సంబంధించిన కంపెనీలు ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగంలోనూ ఉన్నాయి. ఎంటెక్‌ పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి పై రెండు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. జూనియర్‌ ఇంజినీర్‌, అసిస్ట్తెంట్‌ ఇంజినీర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఇంజినీర్‌ ట్రెయినీ లాంటి ఉద్యోగాలకు మీరు అర్హులు. భారీ యంత్రాలతో కూడిన పరిశ్రమలతో పాటు, నూతన సాంకేతికత, ఆటోమేషన్‌, కంట్రోల్‌ అవసరమైన అన్ని రంగాల్లో ఎంటెక్‌ పవర్‌ ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి చాలా ఉద్యోగాలున్నాయి.
మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటే- ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ కోసం వేచి ఉంటూ ఈ లోపల ఆ పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ స్కోరును బట్టి ఇంటర్వ్యూ నియామకాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, ఈసీఐఎల్‌, బీఈఎంఎల్‌, రైల్వే, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌లలో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్ఛు ఇక ప్రైవేటు రంగాల్లో ప్రముఖ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, ఏబీబీ, రిలయన్స్‌, టాటా పవర్‌, జిందాల్‌ పవర్‌, అదానీ పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీల్లో మీకు మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. - ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

ఎం.ఫార్మసీ 2016లో పూర్తిచేశాను. రెండేళ్ల పని అనుభవం ఉంది. యూకేలో ఎంఎస్‌ చేయాలను కుంటున్నాను. అక్కడ ఫార్మసీ రంగంలో అందుబాటులో ఉన్న కోర్సులు, అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థల వివరాలను తెలియజేయండి. - వి. జయంతి

మీ రెండేళ్ల ఉద్యోగ అనుభవం యూకే వెళ్లడానికి సాయపడుతుంది. అక్కడ ఫార్మసీలో ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌, జనరల్‌ ఫార్మసీ ప్రాక్టీసెస్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్యూఎస్‌ లేదా టైమ్స్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా మంచి యూనివర్సిటీని ఎంపిక చేసుకోవచ్చు. యూనివర్సిటీలను ఎంచుకున్న తర్వాత పూర్వ విద్యార్థులతో మాట్లాడితే తగిన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ రంగానికి సంబంధించిన విజ్ఞానవంతమైన మానవవనరులు అభివృద్ధి చెందుతున్నాయి. ఫార్మసీ రంగానికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. ఫార్మసీ డిగ్రీ ఉన్నవాళ్లకి ఇండస్ట్రీలో క్లినికల్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌, ఫార్మకాలజిస్ట్‌ , మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌, ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌ వంటి ఉద్యోగాలు ఉంటాయి.

ఎమ్మెస్సీలో ఫుడ్‌ టెక్నాలజీ /డేటా సైన్స్‌/ బయో ఇన్ఫర్మేటిక్స్‌.. ఈ మూడింట్లో ఏది మెరుగో తెలుపగలరు. బయో టెక్నాలజీకి అవకాశాలు ఎలా ఉంటాయి? - రమాదేవి, హైదరాబాద్‌‌

ఎమ్మెస్సీ ఫుడ్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌, బయో ఇన్ఫర్మేటిక్స్‌ మూడూ కెరియర్‌ పరంగా ఎదుగుదల ఉండే కోర్సులే. ఒక విధంగా డేటా సైన్స్‌, బయో ఇన్ఫర్మేటిక్స్‌లకు తక్కువ వ్యత్యాసం ఉంది. బైపీసీ నేపథ్యం ఉన్నవారికి ఐటీపై ఆసక్తి ఉంటే బయో ఇన్ఫర్మేటిక్స్‌ చేస్తే మంచిది. బయోటెక్నాలజీ చేసినవారికి డ్రగ్‌, ఫార్మా లేబొరేటరీస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌, ఎనర్జీ సంస్థల్లో, డాక్టర్‌ రెడ్డీస్‌ లాంటి సంస్థల్లో అవకాశాలుంటాయి. మార్కెటింగ్‌లోనూ ఉపాధి దొరుకుతోంది.

బీటెక్‌ పూర్తిచేసి, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాను. దూరవిద్య ద్వారా ఎంబీఏ పూర్తిచేశాను. పీహెచ్‌డీ కూడా దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? అందించే సంస్థలేవి? - రాహుల్‌

దూరవిద్యలో పీహెచ్‌డీ ప్రవేశాలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ వారు పూర్తిగా నిలిపివేశారు. ఇటువంటి డిగ్రీలను ఎవరైనా అందించినా అవి చెల్లవు. కాబట్టి ఏదైనా యూనివర్సిటీ లేదా సంస్థ దూరవిద్యలో పీహెచ్‌డీ అందిస్తానంటే మోసపోకండి. పీహెచ్‌డీ విద్యను పుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ విధానంలో మాత్రమే అందిస్తారు.

ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను. డేటా సైన్స్‌ లేదా మెషిన్‌ లెర్నింగ్‌లో పీహెచ్‌డీ కోర్సు చేయాలనుంది. అందించే విశ్వవిద్యాలయాలేవి? విదేశాల్లో అందించే సంస్థలనూ తెలపండి. - యాసాని చంద్రశేఖర్‌

బిగ్‌ డేటా, సమాచార విప్లవంతో డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో పరిశోధన, ఉద్యోగావకాశాలకు గిరాకీ ఏర్పడింది. మనదేశంలో ప్రఖ్యాత ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐఎంలు ఈ విభాగంలో పరిశోధనకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా యూఎస్‌ఏలోని ఎంఐటీ, స్టాన్‌ఫర్డ్‌, కార్నెగీ మెలన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు జీమ్యాట్‌, టోఫెల్‌, ఉద్యోగానుభవం ఆధారంగా చేసుకుని పీహెచ్‌డీ ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

ఎంఎస్‌సీ (జాగ్రఫీ) చేశాను. టౌన్‌ ప్లానింగ్‌ కోర్సులు చేయాలనుంది. వీటిని అందించే విశ్వవిద్యాలయాలతోపాటు అర్హత, నోటిఫికేషన్ల సమాచారాన్నీ అందించండి.? - శ్రీను

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ వ్యవస్థ ఉన్నది మనదేశంలోనే. 2025 నాటికి దేశంలో సగం జనాభా పట్టణాల్లో నివసిస్తుందని ఒక సర్వే తెలియజేస్తోంది. మితిమీరిన పట్టణీకరణ రవాణా, పేదరికం, నిరుద్యోగం, మురికివాడలు, అనధికార గృహ కాలనీలు వంటి వివిధ సవాళ్లను ముందుకు తీసుకొస్తోంది. టౌన్‌ ప్లానర్‌ ముఖ్య విధి- వైవిధ్యంగా, అందరికీ అనుకూలమైన నగర ప్రణాళికను రూపొందించడమే.
కోర్సుల విషయానికొస్తే.. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వారు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నారు. ద గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌ వారు ఎంఎస్‌సీ ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ కోర్సును అందిస్తున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు ఈ కోర్సులు చదవడానికి అర్హులు. మరిన్ని వివరాలకు ignou.ac.in ను సందర్శించవచ్చు.

ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌, లెక్చరర్‌ ఉద్యోగాలు మినహా నాకున్న అవకాశాలేంటి? - టి. శిరీష

మీ ప్రశ్నను చూస్తే మీకు ఇష్టంలేని రంగంలో చదువు కొనసాగించారేమో అనిపిస్తోంది. సాధారణంగా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటారు. వేరే వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి, మీరు బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రయత్నించవచ్చు. అలాగే, ఎస్‌ఎస్‌సీ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. నేర పరిశోధనపై ఆసక్తి, చాకచక్యం, సమయస్ఫూర్తి ఉంటే సీబీఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సమాజసేవ పట్ల ఆసక్తి ఉంటే యూపీఎస్‌సీ పరీక్షలు రాసి, సివిల్స్‌ సాధించవచ్చు. వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటే.. నలుగురికి ఉపాధిని కల్పించినవారూ అవుతారు. ముందుగా మీకు ఆసక్తి దేనిలో ఉందో ఆ రంగాన్ని ఎంచుకుని దానిలో నైపుణ్యాన్ని సాధించండి. ఉద్యోగావకాశాలు వాటంతటవే కనిపిస్తాయి.

బీటెక్‌ పూర్తిచేశాను. ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. పూర్తయ్యాక కోర్సులేమైనా చేస్తే మేలా? నాకున్న ఉద్యోగావకాశాలేంటి? నాకున్న స్వదేశీ, విదేశీ విద్య, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

ప్రతి మాన్యుఫాక్చరింగ్‌, మెషినింగ్‌ యూనిట్లకు టూల్స్‌ జీవనాడి లాంటివి. ఎక్కువ పని సామర్థ్యం, నాణ్యత, తక్కువ ఖర్చుతో పని సాధ్యం చేసే టూల్స్‌ సర్వత్రా అవసరం. కానీ ఈ విభాగంలో నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు చేయగలిగేవారికి మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. మీరు రెండో సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ముందుగా ఏదైనా సంస్థలో ప్రాజెక్టు వర్క్‌ చేయడం ద్వారా పని అనుభవాన్ని పొందండి. ఈ రంగంలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు ఆదరణ ఉంటుంది. కాబట్టి చదువుతోపాటే కొంత పని అనుభవాన్ని పొందినట్లవుతుంది. సాధారణంగా ఐఐటీలు, నిట్‌ల్లో ఎంటెక్‌ (టూల్‌ డిజైనింగ్‌) చేసినవారికి మంచి వేతనం, భవిష్యత్తు ఉంటుంది. మీకు ఆటోమొబైల్‌, మాన్యుఫాక్చరింగ్‌, మెషినింగ్‌ యూనిట్లలో టైల్‌ డిజైనర్‌, టూల్‌ డిటైలర్‌, స్పేర్‌ పార్ట్‌ డిజైనర్‌, ప్రొడక్ట్‌ డిజైనర్‌, కాస్ట్‌ ఇంజినీర్‌, డ్రాఫ్టింగ్‌ వంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉన్నతవిద్య దృష్ట్యా దేశవిదేశాల్లో పీహెచ్‌డీని అభ్యసించే అవకాశం ఉంది.

మా అమ్మాయి బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. తను ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవడానికి అర్హురాలేనా?

ఈఎన్‌టీ చెవి, ముక్కు, గొంతు రుగ్మతలకు సర్జరీ, చికిత్స అందించే శాస్త్రం. ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవాలనుకునేవారు ఎంబీబీఎస్‌తోపాటు సంవత్సరంపాటు ఏదేని ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవేశపరీక్ష ద్వారా ఎంఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. కాబట్టి బీడీఎస్‌ చదువుతున్నవారు ఎంఎస్‌ (ఈఎన్‌టీ) చదవడానికి అవకాశం లేదు.


ఎంటెక్‌ 70 శాతం మార్కులతో ఐదేళ్ళ క్రితం పూర్తిచేశాను. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, బ్యాంకు, సివిల్స్‌ పోటీపరీక్షలు రాశాను. ఒకటి రెండు మార్కుల తేడాతో అన్నీ చేజారాయి. ప్రస్తుతం గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాను. కష్టపడి చదివినా పరీక్షల సమయానికి మరిచిపోతున్నట్లనిపిస్తుంది. భవిష్యత్తుపై నిరాశగా, భయంగా ఉంది. నేనేం చేస్తే మంచిదో సలహా ఇవ్వగలరు.

జీవితంలో విజయం సాధించడానికి ఏకాగ్రత, తదేక దీక్ష అనేవి అత్యవసరం. మీరు ఒకటి రెండు మార్కుల తేడాతో మాత్రమే పోటీపరీక్షల్లో వెనకబడుతున్నారు. అంటే విజయానికి చాలా దగ్గర్లో ఉన్నారనేగా అర్థం! ఒక్కో అడుగు వేస్తూ ఇంతదూరం ప్రయాణం చేసి గెలుపునకు అతి కొద్దిదూరంలో ఉన్న మీరు ఆ అడుగును మందుకు వేయండి! వెనక్కి వేయడం వల్ల మీ శ్రమా, కష్టం వృథా అవుతాయే తప్ప లక్ష్యం చేరుకోలేరు.
సహనం పాటించేవారే జీవితంలో అనుకున్నవి సాధించగలరు. గెలుస్తాననే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం చేజిక్కించుకుంటారు.
ప్రపంచంలోని గొప్పవాళ్ళు ఎందరో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. ఎవరూ ఒక్కరోజులోనో, స్వల్పకాలంలోనో గొప్పవారు కాలేరు. కిందపడ్డా ప్రయత్నం సాగిస్తేనే విజయం వరిస్తుంది. మీ లక్ష్యసాధనకు ఇది తొలిమెట్టు అనుకుని ముందుకు సాగండి. అంతేకానీ... నిరాశ, నిస్పృహలతో సాధించేది ఏదీ ఉండదు.
మీరు పరీక్ష సమయం వచ్చేసరికి టెన్షన్‌ పడి పరీక్ష సరిగా రాస్తానో లేదో అనే భయానికి లోనవుతున్నారు. దానివల్ల చదివినది మర్చిపోయి పరీక్ష సరిగా రాయలేకపోతున్నారు. విజయానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ ధీమాతో ముందుకు వెళ్ళండి. అనుకున్నది తప్పకుండా సాధించగలరు. భవిష్యత్తు గురించి ఆందోళన పడకండి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే తప్పకుండా ఉన్నతస్థానంలో ఉంటారు. అప్పుడు మీ గతంలోని చిక్కులూ, కష్టాలను తలచుకుని ఉల్లాసపడతారు కూడా.
‘మనం కేవలం విజయాల నుంచే పైకి రాలేము. అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి’ అని అబ్దుల్‌ కలామ్‌ చెప్పారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని విజయం కోసం ప్రయత్నించాలి. సవాలు ఎదురైనపుడు మన ప్రతిభను చూపించే అవకాశంగా భావించాలి. అంతేకానీ కుంగిపోకూడదు.
మీరు ఇతర ఉద్యోగాలకు కూడా ప్రయత్నించి చూడండి. మీ చదువుకు మీకు సరిపోయే ఉద్యోగానికి అవకాశం ఉన్నట్లయితే ప్రయత్నించండి. మీ అనుభవమూ, తెలివితేటలూ అక్కడ ఉపయోగపడవచ్చు. ఒక అవకాశం చేజారితే కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. మరో అవకాశం కోల్పోకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు ఎదురవుతాయోనని భయపడుతూ బతికితే జీవితంలోని ఆనందానికి దూరం కావాల్సివస్తుంది. గెలవకపోవటం ఓటమి కాదు; మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి!

మా అబ్బాయి వీఐటీ యూనివర్సిటీ (వెల్లూరు)లో ఎం.ఎస్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు) చదువుతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ డిగ్రీని అంగీకరిస్తారా? ఈ కోర్సు ఎంటెక్‌కు సమానం కాదట. యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి అర్హత ఉంటుందా?

కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్‌ కోర్సు చదివినవారికి కూడా అర్హత ఉంటుంది. ఒకవేళ కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో ప్రత్యేకంగా నాలుగు సంవత్సరాల బీటెక్‌, రెండు సంవత్సరాల ఎంటెక్‌ అర్హత ఉండాలని ఇచ్చినప్పుడు మాత్రమే అర్హత ఉండదు. కానీ, చాలావరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) స్కోరును కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నారు.
మీ అబ్బాయిని గేట్‌ రాయించడానికి ప్రయత్నించండి. యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి పదహారు సంవత్సరాల విద్యను అభ్యసించి ఉండాలి. మీ అబ్బాయి 10+2+5 చదివారు కాబట్టి యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి అతడికి అర్హత ఉంటుంది. అందుకు జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌), ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టులైన టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లలో అర్హత సాధించటం అవసరం.

ఎంఎస్‌సీ చేశాను. డైమండ్‌ టెస్టింగ్‌, జెమాలజీ కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నాను. అందించే విశ్వవిద్యాలయాలేవి? ఉద్యోగావకాశాలనూ తెలపండి.

డైమండ్‌ టెస్టింగ్‌, జెమాలజీ కోర్సులు వైవిధ్యమైనవి. ఈ కోర్సులను భారతదేశంలో కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇండియన్‌ డైమండ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ, జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మొదలైన సంస్థలు డైమండ్‌, జెమాలజీకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.
డైమండ్‌, జెమాలజీకి సంబంధించి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్‌ జువెల్లరీ ప్రొఫెషనల్‌ కోర్సు, ప్రొఫెషనల్‌ డైమండ్‌ గ్రేడర్‌ కోర్సు, జువెల్లరీ డిజైన్‌ ప్రొఫెషనల్‌ కోర్సు, జువెల్లరీ మాన్యుఫాక్చరింగ్‌ ప్రొఫెషనల్‌ కోర్సు, జెమాలజీ ప్రొఫెషనల్‌ కోర్సు మొదలైనవి ఉన్నాయి. డిప్లొమా కోర్సులైన డైమండ్స్‌ అండ్‌ డైమండ్‌ గ్రేడింగ్‌, కలర్డ్‌ జెమ్‌స్టోన్‌ ఐడెంటిఫికేషన్‌, పాలిష్‌ డైమండ్‌ గ్రేడింగ్‌ లాంటి స్వల్పకాలిక కోర్సులు కూడా ఉన్నాయి.
ఈ కోర్సులు చేసినవారికి జువెలరీ తయారీ, డిజైన్‌ రంగంలో, జెమ్స్‌ ఎగుమతి చేసే సంస్థల్లో, జువెలరీ వ్యాపార సంస్థల్లో, జెమొలాజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ఉత్పత్తి చేసే రంగంలో, జెమ్‌స్టోన్‌ టెస్టింగ్‌ లేబొరేటరీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. జెమలాజిస్టులకు ఈరోజుల్లో ఉద్యోగావకాశాలకు కొరతలేదు. ఈ కోర్సులు చదివినవారికి జెమ్స్‌, జువెలరీ రంగంలో జెమాలజిస్టులు, జువెలరీ డిజైనర్‌, డైమండ్‌ గ్రేడర్‌, సేల్స్‌ సిబ్బంది, జెమ్‌స్టోన్‌ ఆక్షన్‌ మేనేజర్లుగా మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలుంటాయి.

మా అమ్మాయి బీటెక్‌ (ఈఈఈ) చేసి ప్రస్తుతం ఎంటెక్‌ (వీఎల్‌ఎస్‌ఐ) చేస్తోంది. బీహెచ్‌ఈఎల్‌, ఇస్రో వంటి సంస్థల్లో ఉద్యోగం సాధించాలంటే గేట్‌, నెట్‌లలో అర్హత సాధిస్తే సరిపోతుందా? ఇంకేమైనా పరీక్షలు రాయాల్సి ఉంటుందా?

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ/ తగిన ఉద్యోగాల భర్తీల కోసం వారు ప్రకటించే నోటిఫికేషన్‌ కోసం ఇస్రో (లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)- www.lpsc.gov.in/, www.nrsc.gov.in/Work_With_Us_careers.html, www.bhel.com/jobs/jobs.php వెబ్‌సైట్లను గమనిస్తుండండి. యూజీసీ (నెట్‌) వారి 2013 ప్రకటన ప్రకారం ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ప్రభుత్వరంగ అధీనంలోని ఉద్యోగాలకు అర్హతగా ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి పీఎస్‌యూలలో గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లని తీసుకుంటారు. బీటెక్‌లో 65% మార్కులతోపాటు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుని దరఖాస్తు చేసుకున్న తరువాత వారు నిర్వహించే రాతపరీక్ష, వ్యక్తిగత మౌఖికపరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఎంటెక్‌ (ఈసీఈ) కమ్యూనికేషన్‌ & సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ స్పెషలైజేషన్‌లో ఇటీవలే పూర్తిచేశాను. ఈ రంగంలో నాకున్న ఉద్యోగావకాశాలను తెలపండి?

సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ వాడకం అన్ని దేశాల్లో పెరుగుతున్నందున ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో అనలాగ్‌ సిగ్నల్‌, డిజిటల్‌ సిగ్నల్‌, స్టాటిస్టికల్‌ సిగ్నల్‌, ఆడియో సిగ్నల్‌, స్పీచ్‌ సిగ్నల్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, వీడియో సిగ్నల్‌, అర్రే సిగ్నల్‌ ప్రాసిసెంగ్‌ ఉంటాయి. దీనిలో అవకాశాల కోసం అసెంబ్లీ లాంగ్వేజ్‌, సీ, సీ++ లో మంచి అవగాహన, రియల్‌ టైం ప్రోగ్రామింగ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఆల్గరిథమ్స్‌, టైం కన్స్‌ట్రైన్ట్స్‌లో మంచి నైపుణ్యం ఉండాలి. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ముఖ్యంగా డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఆదరణ ఉంది. దీనిలో ఉద్యోగావకాశాలకు, ఎదుగుదలకు మంచి అవకాశాలు ఉన్నాయని నాస్కామ్‌ వారు తెలిపారు. డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌కు నెంబర్‌, గణితంలో ప్రావీణ్యం ఎంతో అవసరం. ఇంకా స్పీచ్‌ గుర్తింపు (రికగ్నిషన్‌), కమ్యూనికేషన్‌, కన్వర్జన్స్‌లో పరిశ్రమ ముందుకు వెళ్తోంది. మీకు టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, మోటరోలా, ల్యూసెంట్‌, అనలాగ్‌ డివైజెస్‌, ఇంటెల్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

మెషీన్ డిజైన్‌లో ఎంటెక్ చేశాను. డిజైనింగ్ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. వివరాలు, దరఖాస్తు విధానం తెలుపగలరు?

ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు మాన్యుఫాక్చరింగ్ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. మెషీన్ డిజైన్‌కు సంబంధించి సీపీడబ్ల్యూడీ, డిఫెన్స్, పీబ్ల్యూడీ, ఇతర మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, రైల్వే, కెమికల్, పవర్ ప్లాంట్, ఏరోనాటికల్ సంస్థలు తీసుకుంటాయి. వివిధ ఉద్యోగ పోర్టళ్లు (http://bit.ly/1qvxabq, http://bit.ly/1x1oZ3j, http://bit.ly/1vrbrCO, http://bit.ly/14OBRDm) లో పొందుపరచిన ఉద్యోగావకాశాలను చూసి మీకు సరిపడే ఉద్యోగానికి రెజ్యుమెను అప్లోడ్ చేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంకా లింక్‌డిన్ (http://linkd.in/1ud1dij) లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తగిన సంస్థలను వెతకవచ్చు. ఆ సంస్థల వెబ్‌సైట్లు చూసి, ఈ-మెయిల్/ ఫోను ద్వారా నేరుగా/ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తు చేయడమే కాకుండా దాని స్థితి(స్టేటస్)ని ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండండి.

బీటెక్‌ (ఈఈఈ) 2012లో 85%తో పూర్తిచేశాను. ప్రస్తుతం ఎంటెక్‌ చేస్తున్నాను. తరువాత పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. భారత్‌, యూఎస్‌లలో పీహెచ్‌డీ అవకాశాలున్న విశ్వవిద్యాలయాలేవి? స్కాలర్‌షిప్‌ పొందే అవకాశాలేమైనా ఉన్నాయా?

ఎంటెక్‌ తర్వాత పీహెచ్‌డీ చేయడం సరయిన ఎంపికే. ముందుగా వీటిలో ఒక సబ్జెక్టును ఎంచుకోండి. ఇండస్ట్రియల్‌& కమర్షియల్‌ పవర్‌ సిస్టమ్స్‌, మోటార్‌ డ్రైవ్స్‌ అండ్‌ కంట్రోల్స్‌ , పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ క్వాలిటీ, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, పవర్‌ సిస్టమ్‌ ఎకనామిక్స్‌, మార్కెట్స్‌ & రెగ్యులేషన్స్‌, పవర్‌ సిస్టమ్స్‌ కమ్యూనికేషన్స్‌, పవర్‌ సిస్టం రిలేయింగ్‌ & ప్రొటెక్షన్‌, పవర్‌ సిస్టం స్టెబిలిటీ &కంట్రోల్‌, పవర్‌ సిస్టం ట్రాన్సియేంట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & మెజర్‌మెంట్‌, పవర్‌ సిస్టం ఆపరేషన్స్‌, ప్లానింగ్‌ & రిలయబిలిటీ, ఫొటోవోల్టాయిక్స్‌, విండ్‌, రెన్యువబుల్స్‌, స్మార్ట్‌ గ్రిడ్స్‌, సబ్‌స్టేషన్‌ డిజైన్‌, ట్రాన్స్‌మిషన్‌ &డిస్ట్రిబ్యూషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రిక్‌ మెషినరీ, ఎనర్జీ కన్వర్షన్‌, ఎనర్జీ డెవలప్‌మెంట్‌ & పవర్‌ జనరేషన్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఎనర్జీ సిస్టం డిజైన్‌, హై ఓల్టేజ్‌ ఏసీ/డీసీ, ఫాక్ట్స్‌. వివిధ విశ్వవిద్యాలయాలు ఫెలోషిప్‌/ స్కాలర్‌షిప్‌, ఫండింగ్‌ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. ఇక పీహెచ్‌డీ అందించే విశ్వవిద్యాలయాలు ఐఐటీ, ఎన్‌ఐటీలతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల వివరాలకు http://bit.ly/1128Y4n

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ చేశాను. విదేశీ విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ చేయాలనుకుంటున్నాను. విశ్వవిద్యాలయాలు, అర్హత ఉద్యోగ వివరాలను తెలియజేయగలరు?

మొదటగా ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌, ఓవర్సీస్‌ కెరియర్‌ ఒకటి కాదని తెలుసుకోండి. పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రతి విశ్వవిద్యాలయం వారికీ వారి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌తో పాటు మీ ప్రొఫైల్‌ను, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, జీఆర్‌ఈ/ టోఫెల్‌ స్కోరు, రికమండేషన్‌ లెటర్స్‌ పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (www.cse.ucsd.edu/node/193), నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ (www.nus.edu.sg), స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ (http://stanford.io/1t7jyDo), ఎంఐటీ (http://web.mit.edu/) లాంటి విశ్వవిద్యాలయాల్లో ప్రయత్నించండి. ఉపకారవేతనం అందించే విశ్వవిద్యాలయాల వివరాలకు ఈ వెబ్‌సైట్‌ http://bit.ly

ఎంఎస్సీ (సీఎస్‌) తరువాత ఎంటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను. ఏఐసీటీఈ ప్రకారం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి అర్హురాలినేనా? యూజీసీ నెట్‌లో అర్హత సాధిస్తే భారత్‌లో ఏ కళాశాలలోనైనా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరొచ్చా?

నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను సంవత్సరానికి రెండు సార్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్వహిస్తారు. దీనికి మాస్టర్‌ డిగ్రీలో 55% ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. కాబట్టి మీరు దీనికి ఎంటెక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌ రాస్తే ఉద్యోగం వస్తుందని కాదు. ఇది కేవలం ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం సంపాదించడానికి కనీస అర్హత. ఇది సాధించిన తర్వాత ఆయా కళాశాలలు ఖాళీల గురించి వార్తాపత్రికల్లో/ ఇతర మీడియాలో ప్రకటిస్తారు. దానికి దరఖాస్తు చేసుకుని వారు నిర్వహించే రాత పరీక్షలు/ ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం సంపాదించవచ్చు. యూజీసీ- నెట్‌ నోటిఫికేషన్‌, ఇతర వివరాలకు http://ugcnetonline.in/ ను అనుసరించండి.

ఎంటెక్‌ (అడ్వాన్స్‌డ్‌ పవర్‌ సిస్టమ్స్‌) 2013లో పూర్తిచేశాను. ఫీల్డ్‌ డిజైనింగ్‌/ కోర్‌ కంపెనీల్లో మెయింటెనెన్స్‌ ఉద్యోగం చేయాలనుంది. వీటి ఇంటర్న్‌షిప్‌, ట్రైనింగ్‌ కోర్సుల వివరాలు తెలుపండి.

ఇంటర్న్‌షిప్‌ల కోసం http://bit.ly/1jll5Ld, http://internshala.com, www.letsintern.com లను అనుసరించండి. ఈ వెబ్‌సైట్‌ను చూసి http://bit.ly/1pKg3hz మీకు నచ్చిన కంపెనీలకు దరఖాస్తు చేసుకోండి. ఫీల్డ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాముల కోసం http://bit.ly/1n6WoWE చూడండి. ఇదే కాకుండా మీరు క్రితం శీర్షికల్లో చెప్పినవిధంగా గూగుల్‌ అలర్ట్స్‌ను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఫీల్డ్‌ డిజైనింగ్‌/ కోర్‌ కంపెనీల్లో మెయింటెనెన్స్‌ ఉద్యోగంపై అప్‌డేట్స్‌ పొందవచ్చు.

మా బాబు ఎంటెక్‌ (బయో ఇన్ఫర్మాటిక్స్‌) చేస్తున్నాడు. తరువాత బయోఇన్ఫర్మాటిక్స్‌పై పీహెచ్‌డీ చేయవచ్చా? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కంప్యూటర్స్‌, జీవశాస్త్ర సమస్యల సాధనలపై ఆసక్తి ఉన్నవారు బయోఇన్ఫర్మాటిక్స్‌ చేయవచ్చు. దీనిలో రెండు ముఖ్యాంశాలుంటాయి. మొదటిది- పరికరాలు కనుగొని వాటితో జీవశాస్త్రజ్ఞుల కోసం సమాచారం విశ్లేషించడం. రెండోది- కంప్యూటర్‌ సాంకేతికతను ఉపయోగించి జీవశాస్త్ర పరిశోధన చేయడం (కంప్యూటేషనల్‌ బయాలజీ). శాస్త్రవేత్త కావాలనుకునేవారు పీహెచ్‌డీ చేయడం మంచిదే. అయితే పీహెచ్‌డీ కేవలం సర్టిఫికెట్‌ కోసం కాకుండా శాస్త్రప్రపంచానికీ, సమాజానికీ ఏమివ్వబోతున్నారనేది ముఖ్యం. పరిశ్రమలో అయితే సీనియర్‌ స్థాయి చేరేవరకు అనుకున్నంతగా ఎదుగుదల ఉండకపోవచ్చు. అదే అకాడమిక్‌ రంగంలో అయితే మొదట్లో ఎన్ని పేపర్లు సమర్పించారన్నది ముఖ్యం. అదే గ్రూప్‌ లీడర్‌ అయ్యాక గ్రాంట్స్‌కు దరఖాస్తు చేసి ఎంత రాబట్టగలిగావన్న దానిపైనా ఆధారపడుంటుంది.

ఎంటెక్‌ (ఎలక్ట్రికల్‌ పవర్‌ ఇంజినీరింగ్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. సోలార్‌ ప్లాంట్‌ ప్రాముఖ్యం, నిర్మాణానికి సహకరించే వెబ్‌ వనరుల వివరాలు తెలుపగలరు.

ప్రభుత్వం 2010లో తలపెట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) ముఖ్య ఉద్దేశం 2022 సంవత్సరానికల్లా 20 గిగావాట్స్‌ ఉత్పత్తిని చేరుకోవడం. దీనికి తోడుగా భారత్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సౌరవిద్యుత్తు ప్లాంటును 30వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాజస్థాన్‌లో నిర్మించనుంది. ఈ మధ్యే అతిపెద్ద సోలార్‌ ప్లాంటును మధ్యప్రదేశ్‌లో స్థాపించారు. రోజురోజుకు విద్యుత్తుకు గిరాకీ పెరుగుతున్నకొద్దీ తక్కువ ఖర్చుతో సౌరవిద్యుదుత్పత్తిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి మీరు దీనిలో మీ కెరియర్‌ మొదలుపెట్టడం మంచి ఆలోచనే. ఈ వెబ్‌సైట్‌ http://bit.ly/1i7jA50, http://yhoo.it/1ly2bHm, http://bit.ly/1naEblKల నుంచి సౌరవిద్యుదుత్పత్తి గురించి తెలుసుకోండి.

ఎంటెక్‌ (డీఈసీఎస్‌) 2010లో పూర్తిచేశాను. తరువాత వీఎల్‌ఎస్‌ఐ (ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌) కోర్సు చేశాను. కానీ, ఫ్రెషర్‌ కావడంతో వీఎల్‌ఎస్‌ఐపై ఉద్యోగం రాలేదు. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌/ సూపర్‌వైజర్‌గా చేస్తున్నాను. మంచి కెరియర్‌లో స్థిరపడడానికి ఏ కోర్సులు చేయాలో తెలపండి. ప్రోగ్రామింగ్‌/ కోడ్‌ డెవలపర్‌పై ఆసక్తి లేదు.

వీఎల్‌ఎస్‌ఐలో ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌ చేసి ఉన్నారు కాబట్టి ప్రోగ్రామింగ్‌పై ఇష్టం లేకపోయినా వెరిఫికేషన్‌/ టెస్టింగ్‌ ఇంజినీర్‌లో మీ కెరియర్‌ను మొదలు పెట్టవచ్చు. ఫ్రెషర్‌ అనే భావన పోవడానికి మీరు ఇంటర్న్‌షిప్‌ చేయడం లాభదాయకం. దీంతో మీకు వీఎల్‌ఎస్‌ఐలో నైపుణ్యం మెరుగుపడటంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్న్‌షిప్‌, కెరియర్‌పై ఇతర సందేహాలకు mentor@rrembed labs.comకి మీ CVని పంపి వారు నిర్వహించే ఉచిత వర్క్‌షాపునకు హాజరవ్వండి. Intel, Texas instruments, IBM, Philips, Motorola, SGS- Thompson, Mentor Graphics & Cirrus Logic వంటి బహుళజాతి సంస్థలు ఇదివరకే భారత్‌లో తమ అభివృద్ధి కేంద్రాలు స్థాపించాయి. ఇవేకాకుండా కింద తెలిపిన వీఎల్‌ఎస్‌ఐకి సంబంధించిన మరిన్ని కంపెనీల వివరాలు, తెలుసుకోండి.

ఎంటెక్‌ (ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌) మొదటి సంవత్సరం చదువుతున్నాను. రెండో సంవత్సరం ప్రాజెక్టును విదేశాల్లో చేద్దామనుకుంటున్నాను. అక్కడ అత్యాధునిక, సాంకేతిక, బోధనా పద్ధతులుంటాయని భావిస్తున్నాను. సలహా ఇవ్వగలరు.

మీరు విదేశాల్లో ప్రాజెక్టు చేయడానికి ఇంటెల్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఫ్రీస్కేల్‌, ఫిలిప్స్‌, శామ్‌సంగ్‌, ఎల్‌జీ వంటి వాటిలో ప్రయత్నించండి. భారత్‌లో ప్రాజెక్టుకి Tata Elxsi/ Sasken, Ittiam, Infosys, KPIT, HCL, Mphasis, Symphony మొదలైనవాటిలో కూడా ప్రయత్నించండి. వీఎల్‌ఎస్‌ఐ కంపెనీ వివరాల గురించి ఈ వెబ్‌లింక్‌ http://bit.ly/1eS3hFjని చూడండి. నచ్చిన కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లి వారి ఇంటర్న్‌షిప్‌/ ప్రాజెక్టుల వివరాలను చదివి దరఖాస్తును నేరుగా పంపవచ్చు. ఈ వెబ్‌లింకు http://careers.ti.com/internని చూసి వివరాలు తెలుసుకోండి.

ఎంటెక్‌ (డీఈసీఎస్‌) 2010లో పూర్తిచేశాను. తరువాత వీఎల్‌ఎస్‌ఐ (ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌) కోర్సు చేశాను. కానీ, ఫ్రెషర్‌ కావడంతో వీఎల్‌ఎస్‌ఐపై ఉద్యోగం రాలేదు. ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌/ సూపర్‌వైజర్‌గా చేస్తున్నాను. మంచి కెరియర్‌లో స్థిరపడడానికి ఏ కోర్సులు చేయాలో తెలపండి. ప్రోగ్రామింగ్‌/ కోడ్‌ డెవలపర్‌పై ఆసక్తి లేదు.

వీఎల్‌ఎస్‌ఐలో ఫ్రంట్‌ ఎండ్‌ డిజైన్‌ చేసి ఉన్నారు కాబట్టి ప్రోగ్రామింగ్‌పై ఇష్టం లేకపోయినా వెరిఫికేషన్‌/ టెస్టింగ్‌ ఇంజినీర్‌లో మీ కెరియర్‌ను మొదలు పెట్టవచ్చు. ఫ్రెషర్‌ అనే భావన పోవడానికి మీరు ఇంటర్న్‌షిప్‌ చేయడం లాభదాయకం. దీంతో మీకు వీఎల్‌ఎస్‌ఐలో నైపుణ్యం మెరుగుపడటంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్న్‌షిప్‌, కెరియర్‌పై ఇతర సందేహాలకు mentor@rrembed labs.comకి మీ CVని పంపి వారు నిర్వహించే ఉచిత వర్క్‌షాపునకు హాజరవ్వండి. Intel, Texas instruments, IBM, Philips, Motorola, SGS- Thompson, Mentor Graphics & Cirrus Logic వంటి బహుళజాతి సంస్థలు ఇదివరకే భారత్‌లో తమ అభివృద్ధి కేంద్రాలు స్థాపించాయి. ఇవేకాకుండా కింద తెలిపిన వీఎల్‌ఎస్‌ఐకి సంబంధించిన మరిన్ని కంపెనీల వివరాలు, తెలుసుకోండి.

ఎంటెక్‌ రాడార్‌ & మైక్రోవేవ్‌ చేసినవారికి ఎక్కడెక్కడ ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలుపండి.

మీకు డీఆర్‌డీవో, నేవీ, ఎయిర్‌ఫోర్సు, ఇస్రో, ఇండియన్‌ మెటలర్జికల్‌ డిపార్ట్‌మెంట్‌, ఎన్‌ఎండీసీ, శాటిలైట్‌/ టెలి కమ్యూనికేషన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సివిల్‌ ఏవియేషన్‌ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు డీఆర్‌డీఓ ఆర్‌ అండ్‌ డిలో వివిధ భాగాలకు Radar- http://bit.ly/1bradYm, మైక్రోవేవ్‌- http://bit.ly/1bsnvqV వెబ్‌సైట్లను చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను. ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ల్లో ఇంటర్న్‌షిప్‌ అందించే కంపెనీల వివరాలు తెలుపగలరు.

మీరు ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలు ఉదా: జీఈ/ ఫిలిప్స్‌ లాంటి కంపెనీలలో లేదా http://www.perfinthealthcare.com (chennai) దరఖాస్తు చేసుకోవాలి.
డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ (DSP)లో ఇంటర్న్‌షిప్‌ కోసం క్వాల్‌కామ్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో ఎంబెడెడ్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ ఆధారంగా చేయవచ్చు. ఇవేకాకుండా ఇంటర్న్‌షిప్‌, లెట్‌సింటర్న్‌, గూగుల్‌ అలర్ట్స్‌ ఉపయోగిస్తూ ఇంటర్న్‌షిప్‌ వివరాలు తెలుసుకోండి.

బీటెక్‌ (ఈఈఈ) చేసి, ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ పవర్‌ సిస్టమ్స్‌లో ఎంటెక్‌ పూర్తిచేశాను. కోర్‌ కంపెనీల్లో డిజైనింగ్‌/ నిర్వహణ విభాగాల్లో చేయాలని ఉంది. ఈ అంశాల్లో శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ ఇచ్చే సంస్థల వివరాలు తెలుపగలరు.

ఇంటర్న్‌షిప్‌ కోసం టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లి., హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌, అదాని పవర్‌ లిమిటెడ్‌, జీవీకే, జీఎమ్‌ఆర్‌, కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్‌ లిమిటెడ్‌. లాంటి కంపెనీల్లో ప్రయత్నించండి. దీని కోసం మీరు లింకెడిన్‌ ద్వారా ఆ కంపెనీ హైరింగ్‌/ టెక్నికల్‌ మేనేజర్‌ని లేదా హెచ్‌ఆర్‌ని సంప్రదించండి.
నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించే వివిధ కోర్సుల వివరాలకు www.npti.in వెబ్‌సైట్‌ని చూడండి. www.quora.com లాంటి ఫోరంలో చేరి పవర్‌ సిస్టమ్స్‌ గురించి సందేహాలను వ్యక్తపరుస్తూ నిపుణుల నుంచి సమాచారం తెలుసుకోవచ్చు.

ఎంటెక్‌ (cad/cam) నాలుగో సెమిస్టర్‌ చదువుతున్నాను. ఈ రంగానికి సంబంధించిన వివరాలు తెలుపగలరు.

ఒక వస్తువు మొదటి దశ నుంచి తయారయ్యే చివరి దశ వరకూ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్రక్రియలో నాణ్యతతో కూడిన ఉత్పత్తి తయారీ కోసం CAD/ CAMఎంతో ఉపయోగపడుతుంది. ఎంటెక్‌- CAD/CAM చేసినవారికి ఆర్కిటెక్చరల్‌ డిజైనర్‌, కన్సర్వేషనిస్ట్‌, సర్వేయర్‌, సివిల్‌ ఇంజినీర్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రికల్‌ డిజైనర్‌, ఏరోస్పేస్‌ డిజైనర్‌, మెకానికల్‌ డిజైనర్‌, మాన్యుఫాక్చరింగ్‌ డిజైనర్‌, టీచింగ్‌/రీసెర్చ్‌ల్లో ఉపాధి అవకాశాలుంటాయి. మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్లు (ఇంజినీరింగ్‌ డిజైన్‌, డ్రాఫ్టింగ్‌, ప్రొడక్షన్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ / ఆపరేటింగ్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ మెషీన్స్‌), కన్సల్టింగ్‌ ఇంజినీరింగ్‌ ఆఫీసెస్‌ (ప్రొడక్ట్‌ డిజైన్‌, ప్రోటోటైప్‌ డెవలప్‌మెంట్‌, సాలిడ్‌ మోడలింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ స్ట్రెస్‌ అనాలిసిస్‌), ఆర్‌ అండ్‌ డీ సెంటర్లలో ఇలాంటి అవకాశాలను సంపాదించవచ్చు.

బీటెక్‌ (ఈసీఈ) తరువాత ఎంటెక్‌ (వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్‌ డిజైన్‌) 2013లో పూర్తి చేశాను. కమ్యూనికేషన్‌, వీఎల్‌ఎస్‌ఐల్లో ఏది ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది?

ఇదివరకే పీజీ చేశారు కాబట్టి వీఎల్‌ఎస్‌ఐపై మొగ్గు చూపండి. Very Large Scale Integration (VLSI) సర్క్యూట్స్‌ నిత్యం వాడుకలో కంప్యూటర్‌, సెల్‌ఫోన్లు, అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించేది. దీన్ని ఇండస్ట్రియల్‌ అండ్‌ ఆటోమోటివ్‌ మైక్రో కంట్రోలర్లు, వైర్లెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కన్స్యూమర్‌ డిజిటల్‌ టీవీ ఇంకా హాండ్‌ హెల్డ్‌ డివైజెస్‌, కంప్యూటర్‌, స్టోరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లలో ఉపయోగిస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉండనే ఉన్నాయి.
ఉదాహరణకు డీఆర్‌డీవో, ఈసీఐఎల్‌, ఎన్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు; ఇంటెల్‌, సిమెన్స్‌, సిర్రుస్‌ లాజిక్‌- ఇలా ఎన్నో ప్రైవేటు సంస్థల్లో అవకాశాలుంటాయి.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (2012) పూర్తి చేశాను. గేట్‌లో అర్హత సాధించాను. పీజీసెట్‌ ద్వారా మొబైల్‌ అండ్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఈ బ్రాంచిని అందిస్తున్న కళాశాలల వివరాలు తెలుపగలరు.

ఈ కింది కాలేజీల్లో మొబైల్‌, వైర్‌లెస్‌లో కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ కోర్సులు లభ్యమవుతాయి. జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఫర్‌ వుమెన్‌, షేక్‌పేట (http://www.gnits.ac.in/); సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఇబ్రహీంపట్నం (http://cvr.ac.in/home/); మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, దూలపల్లి (http://www.mrcet.com); వర్థమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, శంషాబాద్‌ (http://vardhaman.org/) హైటెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, గండిపేట (http://www.htech.ac.in/); లార్డ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హిమాయత్‌సాగర్‌ (http://www.lordsinstitute.in/).

వైర్‌లెస్‌ అండ్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ చదువుతున్నాను. ఈ కోర్సుకున్న అవకాశాల గురించి తెలుపగలరు.

వైర్‌లెస్‌, మొబైల్‌ కమ్యూనికేషన్‌ రంగంలో వైర్‌లెస్‌ ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌/ స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరుగుతున్నందువల్ల ఈ రంగంలో అవకాశాలకు కొదవే లేదు. ముఖ్యంగా మీరు మెసేజింగ్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ మేనేజర్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌, టెలికమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌/ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌లో కెరియర్‌ను ఎంచుకోవచ్చు. 3జీని ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఇప్పటికే శాంసంగ్‌, హవాయి వంటి ఎన్నో కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం 2020 లక్ష్యం పెట్టుకుని ఇప్పటినుంచే ఆర్‌ అండ్‌ డీ పనులు మొదలుపెట్టాయి. భవిష్యత్తులో వైర్‌లెస్‌ అండ్‌ మొబైల్‌ కమ్యూనికేషన్‌ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది.

2006లో బీటెక్‌ పూర్తిచేశాను. బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలికాం టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ దూరవిద్య ద్వారా సిస్టమ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను. నెట్‌ వర్కింగ్‌లో ఆసక్తి ఉంది. ఇది నాకు ఉపయోగకరమేనా?

టెలి కమ్యూనికేషన్‌ రంగంలో చేస్తూ సిస్టం, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేయడం లాభదాయకమే. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, నెట్‌వర్కింగ్‌ టెలి కమ్యూనికేషన్‌ రంగం వారికి నెట్‌వర్కింగ్‌ గురించి అవగాహన ఉండడం ఎంతో మేలు. ఎందుకంటే వీటికి మరొకదానితో అనుసంధానం ఉంది. కానీ మీరు ముందుగా ఒకదానిపై స్పెషలైజేషన్‌ కోసం దృష్టి పెట్టండి. http://www.spin.rice. edu/publications.html చూడండి.

ఎంసీఏ తర్వాత ఎంటెక్‌ (సీఎస్‌) చేశాను. యూజీసీ నెట్‌ రాయాలనుకుంటున్నాను. యూజీసీ కంప్యూటర్‌ వాళ్లకి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ సబ్జెక్టును మాత్రమే అందిస్తోంది. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. నేను ఈ సబ్జెక్టులో యూజీసీ సర్టిఫికేషన్‌ పొందాలంటే ఎంసీఏతో దరఖాస్తు చేయాలా? లేక ఎంటెక్‌తోనా?

యూజీసీ నెట్‌ రాయడానికి మీరు ఎంసీఏ/ ఎంటెక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంటెక్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే మీకు ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌ పోస్టు సాధించడానికి ఉపయోగపడుతుంది. యూజీసీ నెట్‌లో కంప్యూటర్స్‌ సిలబస్‌ గురించి తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌ని చూడండి. http://www.ugc.ac.in/net/syllabuspdf/87.pdf నోటిఫికేషన్‌, ఇతర వివరాలకు http://ugcnetonline.in/ని అనుసరించండి.

ఎంఎస్సీ (సీఎస్‌) పూర్తిచేసి, ఎంటెక్‌ (సీఎస్సీ) చేస్తున్నాను. ఏఐసీటీఈ ప్రకారం ఇంజినీరింగు కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేయడానికి అర్హురాలినేనా? UGC NET లో అర్హత సాధిస్తే దేశంలోని ఇంజినీరింగు కళాశాలల్లో పనిచేయడానికి వీలవుతుందా?

UGC NETను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. దీనికి మాస్టర్‌ డిగ్రీలో 55శాతం ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. మీరు దీనికి ఎంటెక్‌ ద్వారా అప్త్లె చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.ugcnetonline.in/ వెబ్‌సైట్‌ను చూడండి. నెట్‌ రాస్తే ఉద్యోగం వస్తుందని కాదు. ఇది కేవలం ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం సాధించడానికి కనీస అర్హత. ఇది సాధించిన తర్వాత ఆయా కళాశాలల వారు లెక్చరర్‌ పోస్టుల ఖాళీల గురించి ప్రకటన ఇస్తారు. దానికి దరఖాస్తు చేసుకుని వారు నిర్వహించే రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులై, ఉద్యోగం సంపాదించవచ్చు.

ఎంటెక్‌ పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో శిక్షణ, ఉద్యోగావకాశం అందించే కన్సల్టెన్సీల వివరాలు తెలుపగలరా?

ప్రతి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌కీ కనీసం C, C++ లో ప్రావీణ్యం ఉండవలసిందే. దీన్ని మీకుగా మీరు మెరుగుపరుచుకోవడానికి లింక్‌డిన్‌, ఇతర సామాజిక మాధ్యమాల సాంకేతిక ఫోరాలను అనుసరించండి.
ఇక వందశాతం ఉద్యోగాలు ఇప్పిస్తాం' అంటూ చాలా కన్సల్టెన్సీలు నెరవేర్చలేని వాగ్దానాలు చేస్తుంటాయి. వాటిని నమ్మటం శ్రేయస్కరం కాదు. మిమ్మల్నీ, మీ ప్రతిభనూ నమ్ముకోండి. http://finance.groups.yahoo.com/ group/passion-n-career/ లాంటి గ్రూపుల్లో చేరితే ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో మీరు ఉచితంగానే తెలుసుకోగలరు. పత్రికల్లో వచ్చే అపాయింట్‌మెంట్స్‌ కాలమ్‌ క్రమం తప్పకుండా చూడటం అలవాటు చేసుకోవాలి. ఇంకా గతంలో ఈ శీర్షికలో తెలిపినవిధంగా గూగుల్‌ అలర్ట్స్‌ను కూడా వినియోగించుకోండి.

ఎం.టెక్‌ పూర్తిచేసిన తర్వాత ఒక ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ప్రాజెక్టుల్లో చేయాలని ఉంటుంది. కానీ వరంగల్‌ వదిలిరాలేని పరిస్థితులు. ఇంటి నుంచే పనిచేసుకునేలా సదుపాయం కల్పించే కంపెనీలు ఏమైనా ఉన్నాయా చెప్పండి.

కొన్ని చిన్న, మధ్యతరగతి కంపెనీలు ఎక్కువ ఉద్యోగులను పెట్టుకోకుండా వాళ్ల ప్రాజెక్టు పనులను బయటివారికి ఇచ్చి చేయిస్తూ ఉంటాయి. మీరు ఫ్రీలాన్సర్‌గా అలాంటి సంస్థలకు పనిచేయవచ్చు. గురు.కామ్‌, ఇలాన్స్‌.కామ్‌ లాంటి వెబ్‌సైట్స్‌ ద్వారా కూడా ఏ కంపెనీ ఎలాంటి ప్రాజెక్టులకు ఫ్రీలాన్సర్ల కోసం వెతుకుతున్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా మీరు మీ నైపుణ్యాలనూ, నమూనాల (శాంపుల్స్‌)నూ బ్లాగు ద్వారా తెలియజేస్తూ ఆయా కంపెనీలను సంప్రదించి ప్రాజెక్టు పొందవచ్చు. కానీ డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఇంటి నుంచే పనిచేసుకోవచ్చని చెప్తూ లేని ప్రాజెక్టులను పుట్టించే వాళ్ళుంటారు. మోసపోవద్దు.

ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాను. యూజీసీ నెట్‌కి సంబంధించిన వివరాలు తెలపండి.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వాళ్లు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) ను సంవత్సరానికి రెండు సార్లు దేశమంతటా నిర్వహిస్తారు. మార్చి, సెప్టెంబరు నెలల్లో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. జూన్‌, డిసెంబరు నెలల్లో పరీక్ష ఉంటుంది. దీనికి మీకు మాస్టర్స్‌లో 55 శాతం ఉండి ఉండాలి. నెట్‌లో పాస్‌ అయినవాళ్లు లెక్చరర్‌షిప్‌ కి అర్హులు. అనగా వాళ్లు ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కాలేజీలలో లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తోడు ఫెలోషిప్‌ అర్హత సంపాదిస్తారు. రెండు సంవత్సరాల కాల పరిధి ఉంటుంది. నెట్‌ సిలబస్‌ కోసం ఈ వెబ్‌లింక్‌ చూడగలరు.
http://www.ugc.ac.in/net/syllabuspdf/87.pdf.నోటిఫికేషన్‌, పరీక్షాపద్ధతి, ఫీజు, ఇతర వివరాలకు ఈ వెబ్‌సైట్‌ని చూడగలరు. http://ugcnetonline.in/.

B.Tech.-ECC 2011లో పూర్తి చేశాను. ఇపుడు ప్రాజెక్టు ఇంజినీర్‌గా energy efficiencyకంపెనీలో పనిచేస్తున్నాను. ఎంటెక్‌ చేసి కోర్‌ ఇంజినీరింగ్‌ వైపే ఉండాలని అనుకుంటున్నాను. ఎంటెక్‌లో control systemsబ్రాంచి ఎంచుకున్నాను. ఇలా వెళ్లడం మంచిదేనా? నాకు పీజీ తర్వాత ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో చెప్పండి.

కేవలం మాస్టర్స్‌ చేయడం వల్ల ఉపయోగం లేదు. మీరు Master + Ph.D లాంటి పోగ్రామ్స్‌ చేయండి. ఇప్పటికే energy efficiencyలో పనిచేస్తున్నారు కాబట్టి Energy Audit Expertగా ముందుకు వెళ్లడానికిLEEDసర్టిఫికేషన్‌ కోర్సులు http://www.em-ea.org/ని చూసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.Control Systems లోABB, Siemens లాంటివి ఉండనే ఉన్నాయి. అనుభవంతో మెరుగుపరుచుకునే నైపుణ్యాలను బట్టి ఉద్యోగాలు వస్తాయి.