Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సమస్యలపై మంత్రి గంటా ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయని అధికారులపై మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గూగుల్‌ హ్యాంగవుట్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. అతికొద్ది మంది విద్యార్థులకే సాంకేతిక సమస్యలు వచ్చాయని, మిగతా అంతా సవ్యంగానే సాగుతోందని అధికారులు మంత్రికి తెలిపారు. విశాఖపట్నం ప్రాంతంలో కొంతమంది విద్యార్థులకు సంక్షిప్త సమాచారం అందకపోవడం, సహాయ కేంద్రాలు సరిగా పని చేయకపోవడంపై ఆంధ్రా వర్సిటీ ఉపకులపతితోనూ మంత్రి మాట్లాడారు. సహాయ కేంద్రాల పనితీరుపై మే 31 న‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని, ప్రవేశాల సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని అంశాలవారీగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.



Published on 31.5.2018