Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

సాధారణ ర్యాంకర్లకూ మెరుగైన అవకాశాలు!

* ఇంజినీరింగ్‌లో కన్వీనర్‌ కోటా సీట్లకు 64 శాతమే హాజరు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో మీకు 54 వేల ర్యాంకు వచ్చి కన్వీనర్‌ కోటా కోసం పోటీ పడుతున్నారా? దాన్ని 34,652 ర్యాంకుగా భావించవచ్చు. మే 31 (గురువారం) వరకు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ధ్రువపత్రాల పరిశీలనకు 1 నుంచి 54 వేల ర్యాంకు వరకు పిలవగా 34,652 మందే హాజరయ్యారు. అంటే 64 శాతమే కన్వీనర్‌ కోటా సీట్లకు పోటీపడుతున్నారు. ఆ మేరకు సాధారణ ర్యాంకర్లకు అవకాశాలు మెరుగైనట్లే.. 64%లో 1,992 మంది ఏపీ విద్యార్థులున్నారు. వాళ్లు 15 శాతం కోటాలోనే పోటీపడాలి. కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న వారిలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీటు వస్తుందని నమ్మకం ఉన్న వారు, పరిస్థితి చివరకు ఎలా ఉంటుందోనని యాజమాన్య కోటా కింద ప్రయత్నించేవారూ ఉన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోని వారు మరికొన్ని వందల మంది ఉంటారు. ఒకవేళ ఇచ్చుకున్నా ర్యాంకుకు తగినన్ని ఇవ్వకపోవడం వల్ల అసలు సీట్లు దక్కని వారు మరి కొన్ని వందల మంది ఉంటారు. వాటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మే 31 నాటికి 54 వేల మంది ర్యాంకర్లలో సీట్ల కోసం పోటీపడుతున్న వారిలో 25 వేల మంది కంటే ఎక్కువ ఉండరని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఓ మోస్తరు ర్యాంకులు వచ్చినవారికీ కోరుకున్న చోట్ల, తమకిష్టమైన బ్రాంచీల్లో సీట్లు లభించే అవకాశం మెరుగయింది. అయితే సామాజిక, బాలికల రిజర్వేషన్లనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. జూన్‌ 3వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.

Published on 01.6.2018