Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఉత్తమ ర్యాంకర్లు.. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై నిరాసక్తి!

* వందలోపు ర్యాంకుల్లో ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించింది ముగ్గురే
ఈనాడు, అమరావతి: ఏపీఎంసెట్‌-2018 (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌కు ఉత్తమ ర్యాంకులు సాధించినవారు దూరంగా ఉన్నారు. దీంతో పెద్ద ర్యాంకులు సాధించిన వారికి మంచి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు లభించే పరిస్థితి నెలకొంది. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ర్యాంకులు లభించి, నిట్‌, ఐఐటీల్లో సీట్లు వస్తాయని భావించిన వారిలో చాలామంది ఈ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతోపాటు డీమ్డ్‌ ప్రైవేటు వర్సిటీల్లో ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. రుసుములు చెల్లించగలిగే స్థోమత ఉన్నవారిలో చాలామంది వీటిల్లో ప్రవేశాలు పొందారు. వంద ర్యాంకుల లోపులో ముగ్గురు మాత్రమే ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించగా.. 1001-1500 వరకు ర్యాంకుల్లో 167మంది మాత్రమే ప్రవేశాల కోసం ముందుకొచ్చారు. ఐచ్ఛికాలు సమర్పించినవారిలోనూ అత్యధికంగా కంప్యూటర్‌ సైన్సు ఇంజినీరింగ్‌కే ప్రాధాన్యమిచ్చారు. రెండో ఆప్షన్‌గా ఎక్కువ మంది ఈసీఈని ఎంచుకున్నారు. తర్వాత ప్రాధాన్యం మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ బ్రాంచిలకు ఇచ్చారు.
ఇదీ పరిస్థితి..!
* ధ్రువీకరణ పత్రాల పరిశీలన తర్వాత అర్హులైన విద్యార్థులు: 1,11,546
* ఆప్షన్ల కోసం పాస్‌వర్డ్‌ సృష్టించుకోని వారు: 70,273
* ఇప్పటివరకు ఆప్షన్ల నమోదు సంఖ్య: 7,46,419
* అత్యధికంగా ఒక విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు: 422

సీట్లు ఇలా..
* రాష్ట్రంలో 285 ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా ఇంజినీరింగ్‌ సీట్లు: 93,467
* ఫార్మసీ కన్వీనర్‌ సీట్లు: 6,541
* 23 విశ్వవిద్యాలయాల కళాశాలల్లో ఇంజినీరింగ్‌ సీట్లు: 4,834
* ఏడు వర్సిటీ ఫార్మసీ కళాశాలల్లో సీట్లు: 196



Published on 01.6.2018