Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 8,702 మంది హాజరు

ఈనాడు డిజిటల్, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్-2018లో 54,000 నుంచి 68,000 మధ్య ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు జూన్ 1న కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 సేవాకేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు 8,702 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటివరకు 43,354 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కాగా.. 16,349 మంది ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఇచ్చారని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్మిత్తల్ తెలిపారు. జూన్ 2న 68,001 నుంచి 82,000 మధ్య ర్యాంకులు సాధించిన వారికి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 5లోగా ఐచ్ఛికాలు ఎంచుకోవాలన్నారు.


Published on 02.6.2018