Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు బీసీలే ఎక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు అత్యధికంగా బీసీ విద్యార్థులే పోటీ పడుతున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 58,732 మంది హాజరయ్యారు. వారిలో బీసీలు 27,110 మంది ఉండగా.. ఆ తర్వాత 21,266 మందితో ఓసీలు రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్‌ కోటాలో 50 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఓసీలతోపాటు ఇతర అన్ని వర్గాలు పోటీపడతాయి. ఎస్‌సీలకు 15 శాతం, ఎస్‌టీలకు 7 శాతం కేటాయిస్తారు. బీసీ-ఏకి 7 శాతం, బీసీ-బి:10, బీసీ-సి: 1, బీసీ-డి: 7, బీసీ-ఇ: 4 శాతం రిజర్వేషన్‌ ఇస్తారు.

Published on 05.6.2018