Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఎంసెట్‌ ఆప్షన్లకు 900 మంది దూరం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన 900 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోలేదు. మొత్తం 58,947 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాగా..వారిలో 58,047 మందే కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఐచ్ఛికాలు (ఆప్షన్లు) ఇచ్చుకున్నట్టు, మొత్తం 29.60 లక్షల ఆప్షన్లు నమోదైనట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. అంటే ఒక్కో విద్యార్థి సగటున 51 ఐచ్ఛికాలు నమోదుచేశారని, వారికి జూన్ 8వ తేదీన సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

Published on 07.06.2018