Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

‘ఇంజినీరింగ్‌’ ఫీజు చెల్లింపునకు 14 వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ మొదటి విడతలో సీట్లు పొందిన ఎంపీసీ విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించే గడువును జూన్‌ 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రుసుం చెల్లింపు తర్వాత ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ కూడా 14వ తేదీ వరకు చేయవచ్చని పేర్కొన్నారు.
జులై 2వ వారంలో రెండో విడత
జులై 2వ వారంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రెండో విడత (ఎంపీసీ విద్యార్థులకు) కౌన్సెలింగ్‌ జరగనుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీ తదితర సంస్థల్లో సీట్ల భర్తీకి జూన్‌ 15వ తేదీ నుంచి జోసా ద్వారా కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. జూన్‌ 27న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. మొత్తం ఏడు విడతల కౌన్సెలింగ్‌లో 4వ విడత సీట్లను జులై 9వ తేదీన కేటాయిస్తారు. అప్పటికి చాలా వరకు ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు వస్తాయా?రావా? అన్న దానిపై విద్యార్థుల్లో స్పష్టత వస్తుంది. జులై 18కి జేఈఈ కౌన్సెలింగ్‌ 7వ విడత సీట్లు కేటాయిస్తారు. జులై చివరి వారంలో చివరి విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జరుపుతారు.

Published on 13.06.2018