Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

25 నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

* 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ప్రాసెసింగ్‌ రుసుమును ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించే విధానాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీలు రూ.600, ఇతరులు రూ.1200 చొప్పున రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఈ రుసుములను వెబ్‌సైట్‌లోని లింకు ద్వారా చెల్లించవచ్చు. మే 28వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ మొదలవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. ఒక్కో రోజును 4 భాగాలుగా విభజించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 11.30 నుంచి మధ్యాహ్నం 2 వరకూ, 2 నుంచి 3.30 వరకు, 3.30 నుంచి సాయంత్రం వరకు ప్రక్రియ సాగుతుంది. ఏ ర్యాంకు వారికి ఏ సమయం అన్నది వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
మే 10 నాటికి కళాశాలల జాబితా ఇస్తామని ప్రకటించిన జేఎన్‌టీయూహెచ్‌ గురువారం రాత్రి వరకు పూర్తిస్థాయిలో కళాశాలలు, సీట్ల వివరాలను అందించలేదు. మొత్తానికి సీట్ల సంఖ్య మాత్రం 93 వేల వరకు ఉంటుందని తెలిసింది.
ఎంసెట్‌ కాలపట్టిక ఇదీ..
మే 25 - జూన్‌ 2 వరకు: ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపు
మే 28 - జూన్‌ 3: ధ్రువపత్రాల పరిశీలన
మే 28 - జూన్‌ 5: వెబ్‌ ఆప్షన్లు
జూన్‌ 8: సీట్ల కేటాయింపు
జూన్‌ 8- 12: ట్యూషన్‌ రుసుం చెల్లింపు, వెబ్‌సైట్‌ నుంచి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం.
ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన
మే 28: 1 - 10,000,
29: 10,001 - 25,000
30: 25,001- 40,000,
31: 40,001- 54,000
జూన్‌ 1: 54,001 - 68,000
2: 68,001 - 82,000
3: 82,001 - చివరి ర్యాంకు వరకూ
https://tseamcet.nic.in/Default.aspx

Published on 25.5.2018