Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

మే 28 నుంచి ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. మొదటిరోజున టీఎస్‌ ఎంసెట్‌-2018లో 1 నుంచి 10వేల వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 1 నుంచి 40వేలలోపు ర్యాంకులు సాధించిన ప్రత్యేక కేటగిరీ (ఎన్‌సీసీ) అభ్యర్థులు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌, మాసబ్‌ట్యాంక్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ సూచించారు. వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మే 28 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మెరుగైన కళాశాల, కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అభ్యర్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఐచ్ఛికాలు(ఆప్షన్లు) నమోదు చేసుకోవాలని సూచించారు.

Published on 28.5.2018