Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

కౌన్సెలింగ్‌కు ఎంసెట్‌ టాపర్లు దూరం

* మొదటి 100 మందిలో ముగ్గురే హాజరు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు టాప్‌ ర్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు కచ్చితంగా వస్తాయన్న విశ్వాసం ఉన్న వారు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చేరాలనుకున్న వారూ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన మే 28న‌ ప్రారంభమైంది. ఒకటి నుంచి 10 వేల ర్యాంకర్ల వరకు మొదటి రోజు కౌన్సెలింగ్‌కు పిలవగా వారిలో 5,699 మంది హాజరయ్యారు. మొదటి 100 ర్యాంకర్లలో కేవలం ముగ్గురే రావడం గమనార్హం. ధ్రువపతాల్ర పరిశీలనకు వచ్చిన వారు జూన్‌ 5 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
బ్రాంచీల వారీగా సీట్లు
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సీట్లు 95,239 ఉండగా కన్వీనర్‌ కోటా కింద (కౌన్సెలింగ్‌) 64,566 సీట్లను భర్తీ చేస్తారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అర్హత సాధించిన వారే ఈ సీట్లకు అర్హులు. మొత్తం 33 బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.


Published on 29.5.2018