Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

కౌన్సెలింగ్‌ కష్టాలు

* ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో తొలిరోజు ఇబ్బందులు
* ఇంటర్‌ మార్కుల మార్పులతో మారిన ర్యాంకులు
* కొత్తవి అప్‌డేట్‌ చేయడంతో మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలు
* మొదటిసారిగా ఆన్‌లైన్‌లోనే ధ్రువపత్రాల పరిశీలన
* కొత్తగా 5 సహాయ కేంద్రాల ఏర్పాటు

ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తొలిరోజు విద్యార్థులు కొంత ఇబ్బందిపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించలేకపోయారు. ఇంటర్‌ మార్కుల పునఃలెక్కింపు, పరిశీలన కారణంగా ఎంసెట్‌ ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో పాతర్యాంకుల స్థానంలో కొత్తవాటిని మార్పు చేసేందుకు వెబ్‌సైట్‌ను కొంతసమయం నిలిపివేశారు. మధ్యాహ్నం వరకు ఈ ప్రాసెసింగ్‌ సాగడంతో రుసుములు చెల్లింపునకు విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మారిన ర్యాంకుల సమాచారం కొందరు అభ్యర్థుల మొబైల్‌ ఫోన్లకు రాకపోవడంతో వారు రుసుములను చెల్లించలేకపోయారు. ఫోన్‌ నంబర్లు తప్పుగా నమోదు చేయడం వల్లే ఈ ఇబ్బందులు వచ్చాయని, వాటిని సరి చేశామని అధికారులు వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించినా రసీదులు డౌన్‌లోడ్‌ కాలేదు. మొబైల్‌ ఫోన్‌లకు మాత్రం బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపులు జరిగినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. ఇలాంటి వారు మే 28న‌ సహాయ కేంద్రాలకు వచ్చారు. ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ బ్రౌజర్‌ వెర్సన్‌ 9.0పైన ఉండేవాటిని వినియోగించాలని, ఒకవేళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వెళ్లిపోయినా తిరిగి మళ్లీ ఖాతాలో జమ అవుతాయని ఎంసెట్‌ ప్రత్యేక అధికారి రఘునాథ్‌ వెల్లడించారు. రసీదు వస్తేనే రుసుము చెల్లింపు జరిగినట్లని తెలిపారు.
మొదటిసారిగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ప్రాసెసింగ్‌ రుసుముల చెల్లింపులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమయం, వ్యయాన్ని ఆదా చేసేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సహాయ కేంద్రాలను సంప్రదించమని మొబైల్‌ ఫోన్‌కు సంక్షిప్త సందేశం వస్తేనే సహాయ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇంటర్‌ మార్కులతో మారిన ర్యాంకులు..
ఇంటర్‌లో పునఃలెక్కింపు, పరిశీలన మార్కులు రావడంతో ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2,363మంది విద్యార్థుల ర్యాంకులను ప్రకటించారు. వీరిలో 1,863 మంది ర్యాంకుల్లో మార్పులు జరిగాయి. సీబీఎస్‌ఈ, ఇతర బోర్డుల ద్వారా ఇంటర్‌ అభ్యసించిన మరో 11,330 మంది విద్యార్థులు మార్కులు అందజేయకపోవడంతో ర్యాంకులు కేటాయించలేదు. సుమారు 8,500మంది వరకు ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ ఇంటర్‌లో అనుత్తీర్ణులయ్యారు. వీరు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసినందున ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ర్యాంకులు అందజేస్తారు. ఇప్పటి వరకు ప్రకటించిన విద్యార్థులందరి ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు.
కొత్తగా సహాయ కేంద్రాలు ఏర్పాటు..!
ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఏమైనా సమస్యలు ఏర్పడితే పరిష్కరించేందుకు 9 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా మరో ఐదు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మే 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించడం, ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో తప్పులు, ఇతర సమస్యలను నివృత్తి చేసేందుకు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఫోన్‌నంబర్లు 9100427219, 9100427200, 9502937373, 9502971717, ఈ-మెయిల్‌ convenerapeamcet2018@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
* ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల(మహిళ) కడప
* ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, విజయనగరం
* ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల(మహిళ), నెల్లూరు
* ప్రభుత్వపాలిటెక్నిక్‌ కళాశాల, శ్రీకాకుళం
* డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఒంగోలు

Published on 29.5.2018