Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

2వ రోజు కౌన్సెలింగ్‌కు 64 శాతమే హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలనకు రెండో రోజు మే 29న‌ 64 శాతం మంది విద్యార్థులే హాజరయ్యారు. కౌన్సెలింగ్‌కు 10,001 నుంచి 15వేల ర్యాంకు వరకు ఆహ్వానించగా వారిలో 9,652 మంది వచ్చారు. మొదటి రెండు రోజుల్లో 25 వేల ర్యాంకర్లలో 15,557 మందే హాజరయ్యారు. 9,500 మంది ముందుకు రాలేదు. మూడో రోజు మే 30న‌ 25,001 ర్యాంకు నుంచి 40వేల ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.

Published on 30.5.2018