Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

30న సీబీఎస్‌ఈ అభ్యర్థుల ర్యాంకుల జాబితా

కాకినాడ, న్యూస్‌టుడే: ఏపీ ఎంసెట్‌ రాసిన సీబీఎస్‌ఈ అభ్యర్థుల ర్యాంకుల జాబితాను మే 30న‌ ప్రకటించనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు పేర్కొన్నారు. ఏపీ ఎంసెట్‌లో అర్హత సాధించి, ర్యాంకులు పొందని సీబీఎస్‌ఈ అభ్యర్థులు వారి డిక్లరేషన్‌ ఫారాన్ని ఎంసెట్‌ కార్యాలయానికి అందజేయడంతోవారికి మే 30న‌ ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న చరవాణి సంఖ్యలకు ర్యాంకులను పంపిస్తామన్నారు. ర్యాంకు కార్డులను ఎంసెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Published on 30.5.2018