Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో సమస్యలు పరిష్కరించండి

* అనంతలో హెచ్‌సీయూ అధికారుల పర్యటన: మంత్రి గంటా
ఈనాడు, అమరావతి: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో కొంతమంది విద్యార్థులకు సంక్షిప్త సందేశాలు అందడం లేదంటూ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను వివరణ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేస్తున్నామని, విశాఖపట్నం సహాయ కేంద్రంలో మాత్రమే కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రికి ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పండాదాస్‌ వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనంతపురంలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయంనకు మెంటార్‌గా ఉన్న హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ(హెచ్‌సీయూ) అధికారులు మే 30న‌ అనంతపురంలో పర్యటించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. కేంద్రీయ వర్సిటీ తరగతులు ప్రారంభించేందుకు అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ, జేఎన్‌టీయూ క్యాంపస్‌లను పరిశీలించనున్నారని వెల్లడించారు.

Published on 30.5.2018