Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఎంసెట్‌ ధ్రువీకరణ పత్రాల పరిశీలన గడువు పొడిగింపు

* జూన్‌ 3 వరకు అవకాశం
ఈనాడు, అమరావతి, కాకినాడ న్యూస్‌టుడే: ఏపీ ఎంసెట్‌-2018 (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌కు ప్రాసెసింగ్‌ రుసుము, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు జూన్‌ మూడో తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్‌ పండాదాస్‌ తెలిపారు. ఆప్షన్ల నమోదుతోపాటు ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపు, పత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మే 30న‌ సాయంత్రం ఆరు గంటల వరకు 64,186మంది ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించగా.. 9,754మంది సహాయ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. మే 30, 31న‌ ఆప్షన్ల నమోదుకు 1 - 60వేల మందికి అవకాశం కల్పించగా.. 15,277మంది నమోదు చేసుకున్నారు. 31,152మంది ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించారు. 1-100లోపు ర్యాంకుల వారిలో కేవలం ఒక్కరే ఆప్షన్లు ఇవ్వడం విశేషం. కొంత మంది విద్యార్థులకు లాగిన్‌ ఐడీ నంబరు ఆలస్యంగా రావడంతో ఇబ్బందిపడ్డారు. 60వేలు ర్యాంకుల వరకు విద్యార్థులకు వారి మొబైల్‌ ఫోన్లకు లాగిన్‌ ఐడీ నంబరు పంపించామని, మిగతా వారికి మే 31 న‌ పంపిస్తామని కన్వీనర్‌ పండాదాస్‌ వెల్లడించారు. బి.ఫార్మసీ, ఫార్మ-డీ, బయోటెక్నాలజీల్లో ప్రవేశాలకు బైపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు త్వరలో ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. క్రీడ, ఎన్‌సీసీ, క్యాప్‌, విభిన్న ప్రతిభావంతుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఈ కోటా సీట్ల కేటాయింపు రెండో విడత కౌన్సెలింగ్‌లో చేపట్టనున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.


Published on 31.5.2018