Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తునకు 2 రోజుల గడువు పెంపు

* అపరాధ రుసుం లేకుండా 30వ తేదీ వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. వాస్తవానికి ఈ గడువు సోమవారం (మార్చి 28)తో ముగిసింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు చెబుతున్నారు. అపరాధ రుసుంతో దరఖాస్తు తేదీల్లో మార్పులు ఏమీ ఉండవని కన్వీనర్ రమణారావు తెలిపారు. మార్చి 28 నాటికి ఇంజినీరింగ్‌కు సుమారు 1.34 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో తెలంగాణ నుంచి 1.12 లక్షలు ఉన్నాయి. మిగతావి ఏపీతోపాటు ఇతరులవి ఉన్నాయి. గత ఏడాది ఇంజినీరింగ్‌కు మొత్తం 1,39,682 దరఖాస్తులు అందాయి. ఇంకా సమయం ఉన్నందున దరఖాస్తులు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రెండున్నర వేలు అధికం
గత ఏడాది(2015-16) ఎంసెట్ మెడికల్ విభాగానికి 92,365 దరఖాస్తులు అందాయి. ఈసారి 28 నాటికి సుమారు 95 వేలు వచ్చాయి. ఇంకా కొంత గడువు ఉన్నందున దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చు.

published on 28.03.2016