Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

యథాతథంగా ప్రైవేటు వైద్య కళాశాలల ఎంసెట్‌

విజయవాడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నిర్వహించే ఎంసెట్‌ ఏసీ-2016 యథాతథంగానే జరుగుతుందని ఏపీ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గన్ని ఖాసింబీ తెలిపారు. పరీక్ష మే 13న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరుగుతుందని వివరించారు. దరఖాస్తులు దాఖలు చేసే గడువును మే 5 వరకూ పొడిగించామని తెలిపారు. అనంతపురం, బెంగళూరు. చెన్నై, కొచ్చిన్‌, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్‌, కడప, కాకినాడ, కరీంనగర్‌, ఖమ్మం, కోల్‌కత, కర్నూలు, ముంబయి, నెల్లూరు, దిల్లీ, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని ఖాసింబీ వివరించారు.

published on 01.05.2016