Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

ప్రైవేట్‌ మెడికల్‌ సెట్‌కు 10 వరకు గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో బీ కేటగిరీ ఎంబీబీఎస్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును మే పదో తేదీ వరకు పొడిగించారు. ఈ గడువు మే 5తో ముగిసింది. దరఖాస్తులకు ఆన్‌లైన్‌ ఇబ్బందులు ఎదురైనా, ప్రైవేట్‌ కళాశాలలు సమస్యలు స్పష్టించినా మాసబ్‌ట్యాంకులోని టీఏఎఫ్‌ఆర్‌సీ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించవచ్చని తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి తెలిపారు. మే 20వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది.

published on 06.05.2016