Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

మే 9న యథావిధిగా ఎంసెట్‌ ఫలితాలు

ఈనాడ, విశాఖపట్నం: నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మే 9న ఎంసెట్‌ ఫలితాలను పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సుప్రీం తీర్పు వ్యతిరేకంగా ఉంటే వైద్య కళాశాలల్లో సీట్ల కోసం ఎంసెట్‌ రాసిన విద్యార్థుల ఫలితాలను నిలిపేసి ఇంజినీరింగ్‌ ఫలితాలను మాత్రమే విడుదల చేద్దామని భావించామని అన్నారు. ప్రస్తుతం తీర్పు విద్యార్థులకు అనుకూలంగా రావడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.

published on 07.05.2016