Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

ఈ ఏడాది ‘నీట్‌’ ఉండకపోవచ్చు

* ఏపీ మంత్రి కామినేని
కైకలూరు, న్యూస్‌టుడే: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్‌’ ఈ ఏడాది ఉండకపోవచ్చని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. విద్యార్థులు ప్రస్తుతం ఈ పరీక్షకు సిద్ధంగా లేరని, వచ్చే ఏడాది నుంచి నిర్వహించేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో ఆయన మే 13న విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డా మే 16న జరిగే సమావేశంలో నీట్‌పై తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఎంసెట్‌ రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. కేంద్రం నీట్‌పై నిర్ణయం తీసుకున్న వెంటనే ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

published on 14.05.2016