Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

ఏప్రిల్‌ మూడో వారంలో ఏపీ ఎంసెట్‌?


ఈనాడు, అమరావతి: ఎంసెట్‌-2019 నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. జనవరి 4న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. గతేడాది ఏప్రిల్‌ 22 నుంచి 25 వరకు ఎంసెట్‌ నిర్వహించారు. ఈసారి ఏప్రిల్‌ మూడో వారంలో ఈ పరీక్షలు ఉంటాయని సమాచారం. ఫిబ్రవరి చివరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.



published on 02.01.2019