Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

EAMCET NEWS

విద్యార్థుల వస్తువులు ఇక భద్రం

* ఎంసెట్‌-2 కేంద్రాల వద్ద సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు భద్రపరుచుకోవడానికి ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2కు హాజరుకానున్న అభ్యర్థులు ఇక పరీక్ష కేంద్రం వద్ద సెల్‌ఫోన్‌, ఇతర వస్తువులు, పుస్తకాలు ఎక్కడ దాచుకోవాలన్న బెంగ పడాల్సిన అవసరం లేదు. పరీక్షా కేంద్రాల వద్ద వాటిని దాచుకోవడానికి ప్రత్యేకంగా క్లాక్‌ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. జులై 9న జరగనున్న ఎంసెట్‌2 పరీక్షకు 56,108 విద్యార్థులు హాజరుకానున్నారు. దీని కోసం తెలంగాణ, ఏపీలో 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే పాత అభ్యర్థులపై నిఘా ఉంచారు. ఈ పరీక్షకు 1981లో ఇంటర్‌ పాసైన వారు ఒకరు(46 సంవత్సరాల వయసు) దరఖాస్తు చేశారు. అత్యధికంగా ఈ మార్చిలో ఇంటర్‌ పాసైన వారు 33,300 మంది, ఆ తర్వాత 2015లో ఉత్తీర్ణులైన వారు 15,435, 2014లో ఉత్తీర్ణులైన వారు 5041 మంది దరఖాస్తు చేశారు. 1970-94 మధ్య జన్మించి పరీక్ష రాయబోతున్న వారి వివరాలను అధికారులు పోలీసులకు సమర్పిస్తున్నారు. వారు ఇప్పటికే వైద్య విద్య అభ్యసిస్తూ పరీక్ష రాస్తున్నారా? లాంటి కారణాలను తెలుసుకుంటారు. విద్యార్థుల నుంచి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు.

posted on 04.07.2015