Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

EAMCET NEWS

ఏపీ ఎంసెట్‌కు భారీగా హాజరు

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌-2018 ఇంజినీరింగ్‌, వ్యవసాయ, వైద్య ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 25తో ముగిశాయి. మొత్తం 2,76,189 మంది దరఖాస్తు చేయగా 2,64,295 మంది పరీక్షకు హాజరయ్యారు. వ్యవసాయ, వైద్య విభాగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు 76,752 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 73,371 మంది హాజరయ్యారు. విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ఈ-మెయిల్‌కు ఏప్రిల్ 25న రాత్రి రెస్పాన్స్‌ షీట్లను పంపించామని కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. విద్యార్థులు ఎవరైనా ఈ-మెయిల్‌ ఐడీ తప్పుగా నమోదు చేసి ఉంటే ఏప్రిల్ 26 నుంచి రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేలా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ, వైద్య విభాగం ప్రశ్నాపత్రం, ప్రాథమిక కీని ఏప్రిల్ 26న వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే 27వ తేదీ సాయంత్రం 5గంటలలోగా తెలపాలని సూచించారు. ఎంసెట్‌ ఫలితాలను మే 3న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటరు కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీవోఎస్‌ఎస్‌, టీఎస్‌వోఎస్‌, ఎన్‌ఐవోఎస్‌, డిప్లొమా, ఆర్‌జీయూకేటీ, ఐఎస్‌సీ, ఇతర బోర్డుల నుంచి ఎంసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న డిక్లరేషన్‌ ఫారాన్ని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఏపీ ఎంసెట్‌ కార్యాలయానికి ఈ-మెయిల్‌ ద్వారా గానీ, పోస్టు ద్వారా గానీ అందజేయాలని సూచించారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 95.73 మంది హాజరయ్యారు. ఈ-మెయిల్‌ ద్వారా ప్రశ్నాపత్రం అందనివారు ఎంసెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

posted on 26.04.2018