Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

EAMCET NEWS

మే 2 నుంచి తెలంగాణ ఎంసెట్‌

* హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌కు మే 1 ఆఖరు
* తెలుగు రాష్ట్రాల్లో 87 పరీక్ష కేంద్రాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2018 పరీక్షలు మే 2 నుంచి ప్రారంభంకానున్నాయి. జేఎన్‌టీయూ-హెచ్‌ ఆధ్వర్యంలో 87 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ ఐదు జోన్లు సహా ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్ధిపేట, వరంగల్‌ జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మే 2, 3 తేదీల్లో 73,106 మంది వ్యవసాయ, వైద్య విద్య అభ్యర్థులు 75 కేంద్రాల్లోనూ... మే 4, 5, 7 తేదీల్లో 1,47,958 మంది ఇంజినీరింగ్‌ అభ్యర్థులు 83 కేంద్రాల్లోనూ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,21,064 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందే వెళ్లి తమ పరీక్ష కేంద్రాలను చూసుకుని రావడం మంచిదని సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు మే 1 చివరి తేదీ. పరీక్ష కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తామని విద్యుత్తుశాఖ, ప్రత్యేక అదనపు బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

posted on 01.05.2018