Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

వైవిధ్యం... ఫార్మాస్యూటికల్‌

ఇంజినీరింగ్‌లో ప్రాచుర్యం పొందిన బ్రాంచిల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయనుకోకూడదు. ఆ విషయంలో ఇతర బ్రాంచిలకూ ప్రాధాన్యం ఉంటుంది. కౌన్సెలింగ్‌ తరుణం దృష్ట్యా వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిల సంగ్రహ పరిచయం ఇస్తున్నాం...
      ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఉద్భవించిన శాఖ ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌. ఇదో వైవిధ్యమైన శాఖ. దీనిలో ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌, టెక్నాలజీ శాఖ అభివృద్ధి, ఉత్పత్తుల తయారీ, ప్రక్రియలు, ఫార్మాస్యూటికల్స్‌ పరిశ్రమలో (అంటే మందులు, బయో లాజిక్స్‌) భాగాల గురించిన సమస్య- పరిష్కార సూత్రాలు, ఇంజినీరింగ్‌ పరిమాణాత్మక శిక్షణ ఉంటుంది.
హైదరాబాద్‌ ఫార్మా నగరంగా ప్రసిద్ధి. ఇక్కడ నోవార్టిస్‌, మిలాన్‌, డా. రెడ్డీస్‌, అరబిందో, గ్రాన్యూల్స్‌, నాట్కో వంటి అనేక భారీ సంస్థలు, చిన్న, మధ్యతరహా ఫార్మా సంస్థలూ ఉన్నాయి. ఈ సంస్థలన్నింటికీ ఫార్మాస్యూటికల్‌ ఇంజినీర్లు చాలా అవసరం.
ఈ గిరాకీని దృష్టిలో పెట్టుకుని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ తన పరిధిలో 'బీటెక్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌'ను 2015- 16 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడుతోంది. ఇది కెమికల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన కోర్సు. దీనిలో కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ప్రస్తుతం కావాల్సినంత మంది ఫార్మాస్యూటికల్‌ ఇంజినీర్లు దొరక్కపోవడంతో కెమికల్‌ ఇంజినీర్‌లను నియమించుకుంటున్నారు. బీటెక్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి... బల్క్‌ డ్రగ్‌, ఫార్మాస్యూటికల్‌, ఫుడ్‌, కన్స్యూమర్‌, డెయిరీ, కాస్మొటిక్స్‌ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
ఉద్యోగ విభాగాల వివరాలు
* ప్రాసెస్‌ ఇంజినీర్‌
* ప్రొడక్షన్‌ ఇంజినీర్‌
* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌
* ఆర్‌ అండ్‌ డీ సైంటిస్ట్‌
* క్యూఏ-క్యూసీ ఇంజినీర్‌
* ఆపరేషనల్‌ ఎక్సలెన్స్‌ ఇంజినీర్‌
* సేఫ్టీ ఇంజినీర్‌
* ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌
* డిజైన్‌ ఇంజినీర్‌
* ఆపరేషనల్‌ మెయింటనెన్స్‌ ఇంజినీర్‌
* ఆప్టిమైజేషన్‌ ఇంజినీర్‌
* మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌
* సేఫ్టీ- ఎన్విరాన్‌మెంట్‌, ఎనర్జీ, క్వాలిటీలల్లో అనుభవం ఆధారంగా... ఇన్స్పెక్టర్‌/ ఆడిటర్‌.
ఉన్నత విద్య అవకాశాలు
* కెమికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీస్‌లో ఎంఈ/ ఎంఎస్‌/ ఎంటెక్‌ చేయవచ్చు.
* బయోటెక్నాలజీ, ఎనర్జీ ఇంజినీరింగ్‌, నానో టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌, న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీస్‌ వంటి అంతస్సంబంధ విభాగాల్లోనూ ఎంఈ/ ఎంఎస్‌/ ఎంటెక్‌ చేసే అవకాశముంది.
ఈ కోర్సు ప్రస్తుతం యూడీసీటీ, ముంబయి; అన్నా యూనివర్సిటీ, చెన్నైలలో ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నర్సాపూర్‌ (మెదక్‌)లో ఈ సంవత్సరం నుంచి ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ను అందిస్తున్నారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుకు ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో ఇదొకటి.

posted on 8.6.2015