Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special

టీఎస్‌ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్

* ఇంజినీరింగ్‌లో దాదాపు సమాన స్థాయిలో అర్హులు, కన్వీనర్‌ కోటా సీట్లు
* 5 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో మొత్తం ఇంజినీరింగ్‌ సీట్లు 92,095గా అధికారులు లెక్క తేల్చారు. వాటిల్లో ప్రభుత్వ కళాశాలల్లో 3,040లను మినహాయించగా మిగిలిన మొత్తంలో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాగా పరిగణిస్తారు. ఎంసెట్‌లో ఉత్తీర్ణులై... ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు ఆ సీట్లకు పోటీపడేందుకు అర్హులు. అందుకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ జులై 5 నుంచి ప్రారంభం కానుంది. మొత్తానికి కొంచెం అటుఇటుగా అర్హులు, కన్వీనర్‌ కోటా సీట్లు సమానంగా ఉండటం విశేషం. ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు.. సీట్ల సంఖ్యను తేల్చేందుకు కొద్ది నెలల నుంచి జరుగుతున్న వర్సిటీల కసరత్తు జులై 4వ తేదీతో ముగిసింది. ఇప్పటికే వెబ్‌ ఆప్షన్ల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించినందున దానికి కొద్ది గంటల ముందే ఇంజినీరింగ్‌ కళాశాలలు, సీట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తానికి గత ఏడాది కంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. గత ఏడాది 1,26,468 సీట్లు ఉండగా ఈసారి 92,095 మాత్రమే. ఇందులో కన్వీనర్‌ కోటా సీట్లు 65,379 కాగా.. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు 63,777 మంది కావడం గమనార్హం.
* జేఎన్‌టీయూహెచ్‌లోనే ఎక్కువగా కోత..
గరిష్ఠంగా జేఎన్‌టీయూహెచ్‌ సీట్లలోనే కోత పడింది. మొత్తం 241 కళాశాలలు దరఖాస్తు చేసుకోగా 78 కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిరాకరించారు. అంటే అవి కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అనుమతి ఉండదు. పలు కళాశాలల్లో ప్రయోగశాలలు లేకపోవడం...అర్హులైన అధ్యాపకులు తక్కువగా ఉండటంతో బ్రాంచీలను, సెక్షన్లను సైతం తొలగించారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారి సంఖ్య.. కన్వీనర్‌ కోటా సీట్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండటంతో అందరికీ కోరుకున్న బ్రాంచీల్లో సీట్లు రాకపోవచ్చని భావిస్తున్నారు.
* 5 నుంచి వెబ్‌ ఆప్షన్లు..
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు జులై 5 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి జులై 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు 1వ ర్యాంకు నుంచి 45 వేల ర్యాంకులు వచ్చిన వారు ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. అందుకు అభ్యర్థులు నమోదు చేసుకున్న ఫోన్‌ నెంబరుకు సోమవారమే లాగిన్‌ ఐడీని పంపించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను https://tseamcet.nic.in/ ద్వారా ఇచ్చుకోవచ్చని ఆయన సూచించారు.
* బీఫార్మసీ సీట్లు 4,048
రాష్ట్రంలో మొత్తం బీఫార్మసీ సీట్లు 4,048 ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. విశ్వవిద్యాలయ కళాశాలల్లో 180 ఉండగా 3,868 ప్రైవేట్‌ కళాశాలలో ఉన్నాయి. వాటిల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా కింద 2,888 సీట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది వ‌ర్సిటీల వారీతా సీట్లు ఇవీ...


వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు షెడ్యూల్ ఇదీ...

14న‌ సీట్ల కేటాయింపు
21న‌ చలానా ద్వారా ఫీజు చెల్లింపు, సీటు వచ్చిన కళాశాలలో చేరతామంటూ ఆన్‌లైన్ ద్వారా రిపోర్ట్ చేయడం
24, 25 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఈ తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
27 - సీట్ల కేటాయింపు
29 - తరగతులు ప్రారంభం

Published on 04.07.2016