Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

మరో 360 ఇంజినీరింగ్‌ సీట్లు

* ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లోకి కొత్తగా రెండు ప్రభుత్వ కళాశాలలు
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నుంచి కొత్తగా రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కౌన్సెలింగ్‌ కళాశాలల జాబితాలో ఇవి చేరాయి. వీటిలో గుంటూరు జిల్లా నర్సరావుపేట జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 300 సీట్లు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 60 సీట్లు భర్తీ చేయనున్నారు. నర్సరావుపేట జేఎన్‌టీయూలో కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, మెకానికల్‌, ఈసీఈ, ట్రిపుల్‌-ఈ కోర్సులను 60 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు. ఆదికవి నన్నయ్యలో ఈఐఈ కోర్సులో 30, కంప్యూటర్‌ సైన్స్‌లో 30 చొప్పున సీట్లను భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటిని యథావిధిగా భర్తీ చేస్తారు. ఈ రెండింటితో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య 18కి చేరింది. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు 305 ఉన్నాయి.
ఫీజుల ఖరారు ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు రాష్ట్రంలో జూన్ 9న నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్త ఫీజులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ కళాశాలల వారీగా ఖరారు చేసిన ఫీజుల వివరాలను ప్రభుత్వానికి పంపించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఫీజులపై అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ఆ ఉత్తర్వులు వస్తేనే విద్యార్థులు ఆప్షన్‌ నమోదుకు వీలవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.
10 వేల మంది ఆప్షన్ల నమోదు: 1 నుంచి 35 వేల మధ్య ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ర్యాంకులు సాధించినవారిలో జూన్ 9న 10 వేల మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. 1 నుంచి 50 వేల మధ్య ర్యాంకర్లలో జూన్ 9న వరకు 28,729 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

published on 10.06.2016