Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎంబీబీఎస్‌ సీట్లలో తెలంగాణకు ఊరట

* ఆంధ్రప్రదేశ్‌లో 450 సీట్లకు గండి
* కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు అనుగుణంగా సదుపాయాలు, అధ్యాపకులు తగ్గిన చోట అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. వైద్య విద్యలో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది. కొత్త వైద్య కళాశాలల అనుమతులు, పాత వాటిలో సీట్ల కొనసాగింపునకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. దీనిపై నిపుణులు ఇచ్చిన నివేదికలపై ఇటీవల భారత వైద్య మండలి కార్యనిర్వాహక కమిటీ చర్చించింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ పాల్‌ జూన్ 10న వెల్లడించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 450 ఎంబీబీఎస్‌ సీట్లకు గండి పడింది. తెలంగాణలో 150 సీట్లు కోల్పోయినప్పటికీ మహబూబ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడంతో కొంత ఊరట కలిగింది.

published on 11.06.2016