Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వచ్చే ఏడాది నుంచి ఆయుష్‌ సీట్లూ నీట్‌ ద్వారానే

* రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ
ఈనాడు, హైదరాబాద్‌: ఆయుర్వేద, యునానీ, సిద్ధ వైద్య విద్య సీట్లకు 2017-18 వైద్య విద్య సంవత్సరం నుంచి జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌) ద్వారానే భర్తీచేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాదికి స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశ పరీక్షల ద్వారానే ఆయా వైద్యవిద్య సీట్లను భర్తీ చేసుకోవాలనీ, వచ్చే ఏడాదికి నీట్‌కు సిద్ధం కావాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి లేఖ వచ్చింది.

published on 13.06.2016