Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఎయిమ్స్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ

* తెలంగాణ విద్యార్థి సాత్విక్‌రెడ్డికి మొదటి ర్యాంకు
ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ వైద్యవిద్యలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో తెలంగాణ విద్యార్థి ఎర్ల సాత్విక్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించాడు. సాత్విక్‌.. హైదరాబాద్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి వరకూ, చైతన్య కళాశాలలో ఇంటర్‌ అభ్యసించాడు. ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్‌లో రెండో ర్యాంకు, తెలంగాణ మొదటి ఎంసెట్‌లో 15వ ర్యాంకు సాధించాడు. ఇంటర్‌లో 988 మార్కులు, పదో తరగతిలో 10 జీపీఏ కైవసం చేసుకున్నాడు. సాత్విక్‌ తల్లి శశికళ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కాగా.. తండ్రి నరేందర్‌రెడ్డి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని.. న్యూరోసర్జన్‌గా రాణించాలనేది తన లక్ష్యమని సాత్విక్‌ చెప్పాడు. రోజుకు 13 గంటల పాటు చదివానని వెల్లడించాడు.

published on 15.06.2016