Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

60 కళాశాలల్లో రూ.35 వేలే రుసుము

* 35 నుంచి 40 వేల మధ్య 80 కాలేజీలు
* తొమ్మిదింటిలో రూ.లక్షకు పైగా

ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 60 ఇంజినీరింగ్ కళాశాలల్లో 35 వేల రూపాయల వార్షిక రుసుమును ఖరారు చేయనున్నారు. గత ఏడాది ఇదే రుసుము కలిగిన కళాశాలల సంఖ్య 200కుపైగా ఉంది. ఆ సంఖ్య ఈ సారి ఆరవైకి పరిమితం కావడం గమనార్హం. 2016-17 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు ఇవి అమలులో ఉంటాయి. ఇందులోభాగంగా రుసుములు, ప్రవేశాల నియంత్రణ కమిటీ కళాశాలల యాజమాన్యాల నుంచి ఆదాయ వ్యయ వివరాలను సేకరించింది. దీని ప్రకారం 60 కళాశాలలకు రూ.35వేలు, 80 కళాశాలల్లో రూ. 35 నుంచి 40 వేలు, తొమ్మిది కళాశాలల్లో రూ. 80 వేల నుంచి 90 వేలు, మరో 9 కళాశాలల్లో లక్ష రూపాయలు రుసుము వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు రూ.35వేల కంటే ఎక్కువగా ఖరారు చేయవద్దని కమిటీని కోరాయి. మరికొన్ని మాత్రం కనీస రుసుము రూ.50,200 వరకు ఉండాలని పట్టుబట్టాయి. సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు గడువు ముగిసినా ప్రతిపాదనలు పంపలేదు. ఈ విషయంలో పలు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వివరాలు సమర్పించకున్నా కళాశాలల్లో ప్రవేశాలు యథావిధిగా ఉంటాయి. ఆయా కళాశాలల్లో చేరే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు పూర్వ రుసుమును వసూలు చేయనున్నాయి. దీనివల్ల బోధన రుసుముల చెల్లింపు పథకం కింద అర్హత కలిగిన విద్యార్థులు ఆర్థికంగా నష్టపోనున్నారు. గత ఏడాది కూడా ఇదే సమస్య ఎదురైంది. ఈ విషయంలో అధికారులు దృష్టి సారించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

published on 28.05.2016