Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వ్యవసాయ కోర్సులకు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, డాక్టర్‌ వైయస్సార్‌ ఉద్యాన వర్సిటీల్లో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ టి.వి.సత్యనారాయణ తెలిపారు. బియస్సీ (అగ్రికల్చర్‌), బి.టెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ), బీవీయస్సీ, బి.ఎఫ్‌.ఎస్సీ, బియస్సీ (హానర్స్‌), హార్టికల్చర్‌ కోర్సులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో జులై 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పంపవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేసి పంపిన దరఖాస్తు దారులను మాత్రమే కౌన్సెలింగ్‌కు పిలుస్తామని స్పష్టం చేశారు.
http://forms.angrau.ac.in/

Published on 29.06.2016