Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఏపీలోని మెడికల్ కోర్సులకు ఎంసీఐ గుర్తింపు

దిల్లీ: విజయవాడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ జనరల్ సర్జన్ కోర్సుకు, నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తింపు ఇస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. జూన్ 28న దిల్లీలో జరిగిన ఎంసీఐ సమావేశంలో మంత్రి కామినేని పాల్గొన్నారు. పలు మెడికల్ కోర్సులకు వెంటనే అనుమతి మంజూరు చేయాలని, లేకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎంసీఐ ఛైర్మన్ జయశ్రీ బేన్ మెహతాను మంత్రి కోరారు. సమావేశంలో పూనం మాలకొండయ్యతో పాటు పలువురు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

Published on 29.06.2016