Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

1తో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నమోదు ముగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 22 నుంచి కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన జులై 1తో ముగియనుంది. ఇప్పటి వరకు 57,516 మంది విద్యార్థులు మాత్రమే తమ పేర్లు నమోదుచేసుకున్నారని సెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ ఎం.వి.రెడ్డి తెలిపారు. జూన్ 30న 6,953 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. జులై 1న అన్ని ర్యాంకుల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని పేర్కొన్నారు.

Published on 01.07.2016