Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

* నిరోధక చట్టానికి సవరణలు
ఈనాడు, దిల్లీ: విద్యాసంస్థల్లో ర్యాంగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈమేరకు ర్యాంగింగ్ నిరోధక చట్టం-2009కు సవరణలు తీసుకొచ్చింది. ఒక విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని భౌతికంగా, మానసికంగా వేధించినా కఠినమైన చర్యలు తప్పవు. విద్యార్థుల రంగు, రూపు, జాతి, మతం, కులం, లింగం, లైంగిక దృక్కోణం, ఆహార్యం, జాతీయత, ప్రాంతీయ మూలాలు, భాషా గుర్తింపు, జన్మ-నివాస స్థలాలు, ఆర్థిక నేపథ్యం.. ఇలా ఏ అంశంపై వేధించినా దాన్ని ర్యాగింగ్ కిందనే పరిగణిస్తారు. ఇలా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది. తాజా నిబంధనలతో యూజీసీ కార్యదర్శి జస్పాల్ ఎస్.సంధు గురువారం గెజిట్ ప్రకటన జారీ చేశారు.

Published on 01.07.2016