Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

ఇంటర్ అడ్వాన్స్‌డ్ విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైన 9,847 మంది విద్యార్థులకు ఎంసెట్ - 2016 ర్యాంకులు ప్రకటించారు. ఆ విద్యార్థులకు సెట్ కన్వీనర్ రమణారావు నేరుగా ఎస్సెమ్మెస్‌ల ద్వారా తెలిపారు. వారు తమ ర్యాంకు కార్డులను ఎంసెట్ - 2016 వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునన్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు వీరికి ప్రత్యేకంగా జులై 5, 6 తేదీల్లో అవకాశమిస్తామని కౌన్సెలింగ్ కన్వీనర్ ఎం.వి.రెడ్డి తెలిపారు. వీరు జులై 9, 10ల్లో వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చన్నారు.
https://www.tseamcet.in/

Published on 01.07.2016