Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet Special News

వ్యవసాయ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు గడువు 30

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 1న ప్రకటన జారీ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ కోర్సులకు ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనుంది. జులై 1 నుంచి జులై 30 వరకూ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు పూర్తిచేసిన తరవాత దానిని ప్రింటు తీసి కాపీని తపాలా ద్వారా ఆగస్టు 5లోగా విశ్వవిద్యాలయానికి పంపాలి. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ)లో 312, ఆహార టెక్నాలజీ (బీటెక్‌)లో 36, పశువైద్యం (బీవీఎస్సీ)లో 118, మత్స్యశాస్త్రంలో 11, ఉద్యాన డిగ్రీ (బీఎస్సీ-హార్టీకల్చర్‌)లో 150 సీట్లు ఉన్నాయి. ఉద్యాన డిగ్రీలో 130 సాధారణ కోటాలో, మిగిలిన 20 సీట్లు పేమెంట్‌ కోటాలో భర్తీచేస్తారు. పేమెంట్‌ కోటా సీటు తీసుకుంటే ఏటా రూ.63వేల రుసుం చెల్లించాలి. బైపీసీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు.

Published on 02.07.2016